AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మళ్లీ జోరందుకుంటున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!

Gold, SIlver Prices Today: ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. మీరు బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఆ రోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకొని వెళ్లడం మంచిది..

Gold Price Today: మళ్లీ జోరందుకుంటున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
Today Gold Price
Subhash Goud
|

Updated on: Aug 01, 2026 | 6:21 AM

Share

Gold, SIlver Prices Today: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం అనంతరం బంగారం, వెండి ధరలలో భారీ హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. దేశీయ మార్కెట్ నుంచి అంతర్జాతీయ మార్కెట్ వరకు ధరలు మారుతూ ఉన్నాయి. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ అయిన కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. నిన్న ఉదయం 9 గంటల సమయానికి, బంగారం ధర 0.67% తగ్గి (కామెక్స్‌లో బంగారం ధర), ఔన్సుకు $4132.70 డాలర్లకు చేరుకుంది. వెండి ధరలు కూడా తగ్గాయి. వెండి ధర 0.67% తగ్గి, ఔన్సుకు $58.620 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే దేశీయంగా బంగారం ధరలు పెరుగుదలను చూడవచ్చు. గత రెండు, మూడు రోజుల కిందట ధరలను పరిశీలిస్తే దేశీయంగా బంగారం ధరలు వెయ్యి రూపాయలకుపైనే పెరిగింది. అలాగే వెండి మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆగస్ట్‌ 1వ తేదీన ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,610 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,560 వద్ద ట్రేడవుతోంది. అదే విజయవాడలో కూడా ఇదే ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,760 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,710 వద్ద ట్రేడవుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,610 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,560 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,610 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,560 వద్ద ట్రేడవుతోంది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,610 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,560 వద్ద ట్రేడవుతోంది. కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,610 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,560 వద్ద ట్రేడవుతోంది.

ఇక వెండి విషయానికొస్తే..కిలో గ్రాముకు 2,34,900 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. మీరు బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఆ రోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకొని వెళ్లడం మంచిది. అలాగే ఈ ధరలు జీఎస్టీ, ఇతర ఛార్జీలను బట్టి కాస్త పెరుగుదల ఉండవచ్చని గమనించండి.

Follow Us