AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకున్నవారికి తెలియని సీక్రెట్.. ఈ 3 పనులు చేస్తే మీ లోన్ త్వరగా క్లియర్..

చాలమంది ప్రస్తుత ఆర్దిక పరిస్థితుల క్రమంలో అత్యవసరాల కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా సులువుగా నిమిషాల వ్యవధిలోనే వ్యక్తిగత రుణం పొందవచ్చు. దీంతో చాలమంది వీటని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పర్సనల్ లోన్ తిరిగి చెల్లించేటప్పుడు ఈ టిప్స్ పాటించండి.

Venkatrao Lella
|

Updated on: Apr 30, 2026 | 3:49 PM

Share
ఆర్ధిక పరిస్థితులు, అత్యవసర అవసరాల కోసం ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది పర్సనల్ లోన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఉద్యోగాలు, వ్యాపారులు చేసేవారు తమ వ్యక్తిగత, కుటుంబ, వ్యాపార అవసరాల కోసం ఈ రుణం తీసుకుంటున్నారు. కేవలం తక్కువ డాక్యుమెంటేషన్ ఉండటంతో పాటు సులువుగా పొందే అవకాశం ఉండటంతో ఎమర్జెన్సీ పరిస్థితులు ఎదురైనప్పుడు వ్యక్తిగత రుణం తీసుకుంటున్నారు. బ్యాంకులతో పాటు ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థలు కూడా పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తున్నాయి.

1 / 5
ఇన్‌ స్టంట్ పర్సనల్ లోన్ పేరుతో నిమిషాల్లోనే ఆన్‌లైన్ ద్వారా లోన్ మంజూరు చేస్తున్నాయి. అయితే పర్సనల్ లోన్ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ లోన్‌ను వీలైనంత త్వరగా తీర్చేయాలి. ప్రతీ నెలా మీరు చెల్లించే ఈఎంఐకు అదనంగా మరికొంత చెల్లించాలి. దీని వల్ల మీ ఈఎంఐ కాల వ్యవధి, వడ్డీ రెండూ తగ్గుతాయి. ప్రతీ నెలా మీరు ఈఎంఐ కంటే  ఎక్కువ చెల్లించడం వల్ల లోన్ త్వరగా పూర్తవుతుంది.

2 / 5
ఎక్కువ కట్టడం వల్ల మీ లోన్ త్వరగా పూర్తవ్వడం వల్ల మీకు వడ్డీ డబ్బులు కూడా ఆదా అవుతాయి. మీకు ఆర్ధిక భారం కూడా తగ్గుతుంది. అయితే ఇందుకోసం మీరు నెలవారీ ఖర్చులను తగ్గించుకోవాలి. అనవసరపు అవసరాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గించుకుని పర్సనల్ లోన్ తీర్చడానికి ఉపయోగించుకోవాలి. పర్సనల్ లోన్స్‌ను అన్‌సెక్యూర్డ్ రుణాలుగా పరిగణిస్తారు. ఇది సిబిల్ స్కోర్‌పై ప్రభావితం చూపుతుంది.

3 / 5
మనకు డబ్బులు అవసరమైనప్పుడు వడ్డీ రేటు ఎక్కువున్నా చూసుకోకుండా పర్సనల్ లోన్ తీసుకుంటాం. ఆ తర్వాత వడ్డీ ఎక్కువ పడుతుందని బాధపడుతుంటాం. ఇలాంటి సమయంలో ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు ఉందో.. ఆ బ్యాంకుకు మీ పర్సనల్ లోన్ బదిలీ చేసుకోండి. దీని వల్ల మీకు డ డబ్బులు ఆదా అవుతాయి. అయితే ఇలాంటి సమయంలో కొంత ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

4 / 5
ఇక లోన్ తీసుకున్నాక మీరు క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లిస్తుంటే వడ్డీ తగ్గించమని బ్యాంకును అడగండి. కొన్ని బ్యాంకులు మీ పేమెంట్ హిస్టరీ చూసి వడ్డీని తగ్గించేందుకు ముందుకొస్తాయి. ముందు ఐదేళ్ల కాలవ్యవధితో లోన్ తీసుకుంటే రెండేళ్లు చెల్లించాక ఒకటి లేదా రెండు శాతం వడ్డీ తగ్గిమంచమని అడగండి. దీని వల్ల కూడా మీకు ఫలితం ఉంటుంది

5 / 5
Follow Us