మృణాల్ సినిమాల్లో ఆ వింత సెంటిమెంట్.. అందుకే హిట్లు కొడుతోందా
29 April 2026
Pic credit - Instagram
Phani Ch
మృణాల్ ఠాకూర్.. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతా రామం సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్.
మృణాల్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్స్ గమనిస్తే.. 'సీతారామం'లో దుల్కర్ సల్మాన్ మరణిస్తాడు. అలాగే 'హాయ్ నాన్న'లో కూడా నాని పాత్రకి చావు గండం ఉంటుంది.
ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో, హీరో చనిపోతేనే మృణాల్ సినిమా హిట్ అవుతుందనే టాక్ మొదలైంది.
తాజాగా మృణాల్ ఒక ఇంటర్వ్యూలో ఈ సెంటిమెంట్ గురించి స్పందించింది. తన సినిమాల్లో హీరోలు చనిపోవడం అనేది కేవలం యాదృచ్చికమేనని ఆమె చెప్పుకొచ్చింది.
కానీ ప్రేక్షకులు మాత్రం దీన్ని ఒక సక్సెస్ ఫార్ములాగా భావిస్తుండటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని తెలిపింది.
నిజానికి మృణాల్ ఎంచుకునే కథల్లో భావోద్వేగాలకు పెద్దపీట వేస్తారు. ఆ ఎమోషన్ పండాలంటే కొన్నిసార్లు విషాదాంతం తప్పదు.
అందుకే ఆమె సినిమాల్లోని క్లైమాక్స్ ప్రేక్షకులకు అంతగా గుర్తుండిపోతుంది. సీతారామంలో సీత పాత్ర పడ్డ వేదన ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎట్టకేలకు ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టిన కృతి శెట్టి
కాయడు లోహర్‌కు అర్ధరాత్రి అతని నుండి ఫోన్ కాల్.. షాక్ లో ముద్దుగుమ్మ.. కట్ చేస్తే
జంపర్ మే బంపర్.. రాశి సింగ్ అందాల జాతర మాములుగా లేదుగా