చీరకట్టులో చూడచక్కని భామ మృణాల్.. ఎంత ముద్దుగా ఉందో 

Rajeev 

30 April 2026

instagram

అందాల భామ మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మరాఠీ బుల్లితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె..

ఆ తర్వాత నెమ్మదిగా కథానాయికగా మారింది. హిందీలో హీరోయిన్ ఆఫర్స్ అందుకుంటూ అద్భుతమైన నటనతో మెప్పించింది.

మృణాల్ కు ఎక్కువగా క్రేజ్ వచ్చింది మాత్రం తెలుగు సినిమాతోనే. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఇందులో సీతామహాలక్ష్మీ పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. తెలుగుతోపాటు అటు హిందీలోనూ మరిన్ని ఆఫర్స్ అందుకుంది.

 ప్రభాస్ కల్కి సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. సినిమాలో కనిపించింది కొంచంసేపు మాత్రమే అయినా తన నటనతో ఆకట్టుకుంది. 

ఇక రీసెంట్ గా డెకాయిట్ సినిమాతో హిట్ కొట్టింది మృణాల్. డెకాయిట్ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ అమ్మడికి మరిన్ని ఆఫర్స్  తలుపుతడుతున్నాయి