Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో అతడు చాలా స్పెషల్.. ఛాన్స్ వస్తే కలిసి సినిమా చెద్దామని వెయిట్ చేస్తున్నా.. శ్రీకాంత్..
నటుడు శ్రీకాంత్ తన తాజా ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవతోపాటు టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న హీరోలలో ఒక హీరో చాలా స్పెషల్ అని.. అతడితో ఛాన్స్ వస్తే సినిమా చెద్దామని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

తెలుగు చిత్రసీమలో నాలుగు దశాబ్దాలుగా హీరోగా, సహయ నటుడిగా రాణిస్తున్నారు శ్రీకాంత్. ఇప్పటికీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. తన ప్రస్తుత కెరీర్ దశను ఒక “బోనస్” గా తెలిపారు. “సెకండ్ ఇన్నింగ్స్” లో తాను టెన్షన్లు లేకుండా పనిచేయడాన్ని ఆస్వాదిస్తున్నానని, డబ్బు కంటే ఇదే ముఖ్యమని ఆయన అన్నారు. ఇదివరకు హీరోగా ఉన్నదానికంటే ఇప్పుడు మరింత సంతృప్తిగా ఉన్నానని వెల్లడించారు. తన కుమారుడు రోషన్ కెరీర్ ను పర్యవేక్షిస్తూనే, తాను కూడా విభిన్నమైన కథాంశాలతో హీరోగా సినిమాలు చేయాలనే ఉద్దేశం ఉందని చెప్పారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ల విస్తరణతో ఇండస్ట్రీలో అవకాశాలు పెరిగాయని, ఇది ప్రొడ్యూసర్లకు, నటులకు గొప్ప అడ్వాంటేజ్ అని శ్రీకాంత్ పేర్కొన్నారు. కొత్త దర్శకులు వినూత్నమైన కాన్సెప్ట్ లతో వస్తే తప్పకుండా ఎంకరేజ్ చేస్తానని, గతంలో తాను చిన్న చిన్నోళ్లతో కూడా చాలా సినిమాలు చేశానని గుర్తుచేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Actress : ఎన్టీఆర్, ప్రభాస్‌లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
చిరంజీవి, రామ్ చరణ్ ల మధ్య అనేక పోలికలున్నాయని శ్రీకాంత్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అన్నయ్య కష్టపడే విధానం, యూనిట్ లోని అందరినీ, ముఖ్యంగా ఆర్టిస్టులను చక్కగా చూసుకోవడం, భోజనాల దగ్గర శ్రద్ధ తీసుకోవడం వంటి లక్షణాలు చరణ్ లోనూ ఉన్నాయని అన్నారు. చరణ్ చాలా మెచ్యూర్డ్, ఇంటెలిజెంట్ వ్యక్తి అని, డిగ్నిఫైడ్ గా ఉంటాడని ప్రశంసించారు. ఆర్ఆర్ఆర్ వంటి భారీ విజయం సాధించి, అంతర్జాతీయ స్టార్ గా ఎదిగినా కూడా చరణ్ లో ఎలాంటి గర్వం లేదని, సెట్ లో చాలా సింపుల్ గా ఉంటాడని శ్రీకాంత్ వివరించారు. చిరంజీవి మాదిరిగానే చరణ్ కూడా అందరినీ దగ్గరకు తీసుకుని మాట్లాడుతూ, అన్నయ్య అని పిలుస్తూ ఎంతో గౌరవం ఇస్తాడని తెలిపారు. చరణ్ లోని డీసెంట్ స్వభావం, హుందాతనం తనకు బాగా నచ్చుతాయని చెప్పారు. వయసులో చిన్నవాడైనప్పటికీ, చాలా పరిణతి చెందిన వ్యక్తి అని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : కొబ్బరికాయ కుళ్లిపోయిందని ఆగిపోయిన సినిమా.. బాలయ్య, పవన్ ఆ మూవీ చూసుంటేనా.. డైరెక్టర్ కామెంట్స్..
ఎన్టీఆర్ జూనియర్ తో కూడా తనకు చాలా కాలంగా పరిచయం ఉందని శ్రీకాంత్ తెలిపారు. అతను హీరో కాకముందే, శ్రీనగర్ కాలనీలో ఇంటి పక్కన ఉండేవారని చెప్పారు. ఎన్టీఆర్ ఎప్పుడూ ఎనర్జీ లెవెల్స్ తో, గోలగోలగా ఉంటాడని, ఇప్పటికీ ఆ సరదా తగ్గలేదని పేర్కొన్నారు. వారిద్దరి వ్యక్తిత్వాలు మారలేదని, ఇమేజ్ లు మారినప్పటికీ మనుషులుగా అలాగే ఉన్నారని అన్నారు. ప్రస్తుతం దేవర చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నట్లు తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ, తాను ఇప్పటివరకు ప్రభాస్, మహేష్ బాబులతో కలిసి నటించలేదని వెల్లడించారు. భవిష్యత్తులో వారితో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: శ్రీకాంత్‌తో మూవీ తీస్తున్నప్పుడు.. ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: అతడు గొప్ప నటుడు.. నా జీవితంలో అలాంటి హీరోను చూడలేదు.. నా లైఫ్ పూర్తిగా మార్చేశాడు.. తనికెళ్ల భరణి..
