AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

29 ఫోర్లు, 14 సిక్సర్లు.. 3 ఓవర్లలోనే సెంచరీ.. ప్రపంచ రికార్డ్‌తో బౌలర్లకు బడిత పూజ.. ఎవరంటే?

22 Ball Century Record: క్రికెట్ మైదానంలో బ్యాటర్లు విరుచుకుపడటం మనం చూస్తుంటాం, కానీ ఒకే ఒక్క ఆటగాడు బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ కేవలం 22 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేయడం నమ్మశక్యం కాని విషయం. క్రికెట్ పితామహుడు సర్ డాన్ బ్రాడ్‌మాన్ సృష్టించిన ఈ కళ్లు చెదిరే రికార్డు ఆట చరిత్రలోనే అత్యంత అరుదైన, అద్భుతమైన ఘట్టంగా నేటికీ నిలిచిపోయింది.

29 ఫోర్లు, 14 సిక్సర్లు.. 3 ఓవర్లలోనే సెంచరీ.. ప్రపంచ రికార్డ్‌తో బౌలర్లకు బడిత పూజ.. ఎవరంటే?
Don Bradman Fastest Century
Venkata Chari
|

Updated on: Apr 30, 2026 | 6:29 PM

Share

Don Bradman Fastest Century: క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. కానీ, బ్యాటింగ్ నిర్వచనాన్ని మార్చిన ఘనత మాత్రం ఒకే ఒక్కరికి దక్కుతుంది. నవంబర్ 2, 1931న జరిగిన ఒక క్లబ్ మ్యాచ్‌లో సర్ డాన్ బ్రాడ్‌మాన్ అసాధారణ రీతిలో బ్యాట్ ఝులిపించాడు. ఆ కాలంలో ఒక ఓవర్‌లో 8 బంతులు ఉండేవి. ఆ లెక్కన చూస్తే, కేవలం 3 ఓవర్ల వ్యవధిలోనే ఆయన తన సెంచరీని పూర్తి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

3 ఓవర్లలో 100 పరుగులు..

ఈ చారిత్రక మ్యాచ్‌లో బ్రాడ్‌మాన్ ఎదుర్కొన్న బంతులు కేవలం 22 మాత్రమే. ఆ మూడు ఓవర్ల విధ్వంసం ఇలా సాగింది:

మొదటి ఓవర్: 33 పరుగులు

ఇవి కూడా చదవండి

రెండవ ఓవర్: 40 పరుగులు

మూడవ ఓవర్: 29 పరుగులు

బౌలర్ ఎవరన్నది చూడకుండా, వచ్చిన ప్రతి బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా ఆయన సాగించిన ఈ ప్రస్థానం క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయి. కేవలం వేగంగా ఆడటమే కాకుండా, ప్రతి బంతిపై ఆయనకు ఉన్న పట్టు చూసి అప్పట్లో క్రీడా పండితులు సైతం నోరెళ్లబెట్టారు.

ఇది కూడా చదవండి: హ్యాట్రిక్‌‌పై కన్నేసిన టీమిండియా.. టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌ చూస్తే ప్రత్యర్థులు డకౌట్.. కెప్టెన్‌గా ఎవరంటే?

256 పరుగుల సునామీ..

సెంచరీతో ఆగకుండా, బ్రాడ్‌మాన్ ఆ మ్యాచ్‌లో మొత్తం 256 పరుగుల భారీ స్కోరు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 29 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. నేటి టీ20 యుగంలో కూడా ఇంతటి దూకుడు ప్రదర్శించడం కష్టమే, అలాంటిది ఆ రోజుల్లోనే మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ బౌలర్లను బెంబేలెత్తించాడు. రన్ మెషీన్‌గా పేరుగాంచిన ఆయన, ఆట పట్ల తనకున్న ఆకలిని ఈ ఇన్నింగ్స్ ద్వారా మరోసారి నిరూపించుకున్నాడు.

ఇది కూడా చదవండి: మన పూర్వీకుల టిఫీన్ ఇదే.. ఒక్కటి తింటే చాలు.. తస్సాదియ్యా కొండలనైనా పిండి చేస్తారంతే..!

బౌలర్ల పీడకల..

లిత్గో జట్టు బౌలర్లు విల్ బ్లాక్, హౌరీ బేకర్‌లకు ఆ రోజు ఒక పీడకలలా మిగిలిపోయింది. బ్రాడ్‌మాన్ ధాటికి వారు బంతులు వేయడానికే భయపడే పరిస్థితి నెలకొంది. మొదటి, మూడవ ఓవర్లలో విల్ బ్లాక్‌ను టార్గెట్ చేసిన డాన్, రెండవ ఓవర్‌లో బేకర్‌ను చీల్చి చెండాడారు. ఈ విధ్వంసం కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు, క్రికెట్ ప్రపంచంలో ఒక ఆటగాడు ఎంతటి ఆధిపత్యాన్ని చెలాయించగలడో చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం.

ఇది కూడా చదవండి: Punarnava Dal: ఇది కూర కాదు.. ఒంట్లో పార్ట్స్ అన్నీ రిపేర్ చేసే సంజీవని.. ఎలా వండాలో తెలుసా?

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
Team India: టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా తెలుగోడు..?
Team India: టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా తెలుగోడు..?
60 రోజుల్లో అమెరికా వదలకుంటే జైలుకే?రోడ్డున పడ్డ భారతీయులు
60 రోజుల్లో అమెరికా వదలకుంటే జైలుకే?రోడ్డున పడ్డ భారతీయులు
ఆపరేషన్ ‘నీలీ’.. వెతికి,వేటాడి మట్టుబెడుతున్న ఇజ్రాయెల్!
ఆపరేషన్ ‘నీలీ’.. వెతికి,వేటాడి మట్టుబెడుతున్న ఇజ్రాయెల్!
క్షిపణులను బూడిద చేసే S-400.. రష్యా నుంచి భారత్‌కు
క్షిపణులను బూడిద చేసే S-400.. రష్యా నుంచి భారత్‌కు
‘ఎబోలా ' కలకలం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్
‘ఎబోలా ' కలకలం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్
జవాన్ తల్లికి దక్కని న్యాయం.. కట్ చేస్తే 50 మంది కమాండోలు..!
జవాన్ తల్లికి దక్కని న్యాయం.. కట్ చేస్తే 50 మంది కమాండోలు..!
నాడు మనసులు కలిస్తే.. నేడు చాట్‌జీపీటీ ‘ఓకే’ అంటేనే..
నాడు మనసులు కలిస్తే.. నేడు చాట్‌జీపీటీ ‘ఓకే’ అంటేనే..
పాదరస శివలింగ పూజ చేస్తే 48 రోజుల్లో కష్టాలు దూరం.. శివుడి అపార..
పాదరస శివలింగ పూజ చేస్తే 48 రోజుల్లో కష్టాలు దూరం.. శివుడి అపార..
సిక్సర్‌ను సింగిల్‌గా మార్చి బుడ్డోడికి షాకిచ్చిన విల్ జాక్స్..!
సిక్సర్‌ను సింగిల్‌గా మార్చి బుడ్డోడికి షాకిచ్చిన విల్ జాక్స్..!
దేశంలోనే విషాదకరమైన రైలు క్యాన్సర్ ఎక్స్‌ప్రెస్, ఈట్రైన్ కథేంటంటే
దేశంలోనే విషాదకరమైన రైలు క్యాన్సర్ ఎక్స్‌ప్రెస్, ఈట్రైన్ కథేంటంటే