AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2008లో ఎంట్రీ.. 2013లో కెప్టెన్‌గా ప్రమోషన్.. కట్‌చేస్తే.. 7 ఏళ్లలో అంతా కుళ్లుకునే రేంజ్‌లోకి..

IPL Most Successful Captain: రోహిత్ శర్మ ఐపీఎల్ కెప్టెన్సీలోని విజయాలే ఆయనను టీమ్ ఇండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా మార్చాయి. 2024లో ముంబై యాజమాన్యం హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించినప్పటికీ, అభిమానుల గుండెల్లో మాత్రం రోహిత్ శర్మ ఎప్పటికీ శాశ్వత కెప్టెన్. పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ 'హిట్‌మ్యాన్' మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆకాంక్షిద్దాం.

2008లో ఎంట్రీ.. 2013లో కెప్టెన్‌గా ప్రమోషన్.. కట్‌చేస్తే.. 7 ఏళ్లలో అంతా కుళ్లుకునే రేంజ్‌లోకి..
Rohit Sharma Birthday Mi
Venkata Chari
|

Updated on: Apr 30, 2026 | 4:24 PM

Share

IPL Most Successful Captain: భారత క్రికెట్ చరిత్రలో ‘హిట్‌మ్యాన్’గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న రోహిత్ శర్మ నేడు (ఏప్రిల్ 30) తన 39వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఐపీఎల్ కెప్టెన్‌గా ఎదిగిన రోహిత్ ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ముంబై ఇండియన్స్‌కు 5 సార్లు ట్రోఫీని అందించిన రోహిత్ శర్మ విజయగాథపై ప్రత్యేక కథనం..

నాడు నాగపూర్.. నేడు ముంబై రారాజు..

రోహిత్ శర్మ 1987 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని నాగపూర్‌లో జన్మించాడు. చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లిదండ్రులకు దూరంగా ముంబైలోని తాతయ్య వాళ్ల ఇంట్లో పెరిగాడు. వీధి క్రికెట్ నుంచి ప్రారంభమైన ఆయన ప్రయాణం, కఠిన శ్రమతో టీమ్ ఇండియా స్థాయికి చేరింది. కేవలం బ్యాటర్‌గానే కాకుండా, అద్భుతమైన వ్యూహకర్తగా ఆయన తనను తాను నిరూపించుకున్నాడు.

డెక్కన్ ఛార్జర్స్‌తో ఐపీఎల్ ప్రయాణం..

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, రోహిత్ శర్మ తన ఐపీఎల్ కెరీర్‌ను 2008లో డెక్కన్ ఛార్జర్స్‌తో ప్రారంభించాడు. అప్పట్లో ఆయనను డెక్కన్ టీమ్ 4.8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. బ్యాటింగ్‌తోనే కాకుండా తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తోనూ రోహిత్ అప్పట్లో ఆకట్టుకున్నాడు. 2009లో డెక్కన్ ఛార్జర్స్ టైటిల్ గెలిచినప్పుడు రోహిత్ ఆ జట్టులో కీలక సభ్యుడిగా నిలిచాడు. ఆ సీజన్‌లో ఆయన 362 పరుగులతో పాటు 11 వికెట్లు కూడా తీయడం గమనార్హం.

ముంబై ఇండియన్స్‌లో చేరిక, ఆ తర్వాత కెప్టెన్సీ..

2011 వేలంలో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను సుమారు 9 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అప్పటి నుంచి ముంబై జాతకమే మారిపోయింది. 2013 సీజన్ మధ్యలో రికీ పాంటింగ్ కెప్టెన్సీ నుంచి తప్పుకుని రోహిత్‌కు పగ్గాలు అప్పగించమని కోరారు. ఆ నిర్ణయం ముంబై ఇండియన్స్ చరిత్రను మలుపు తిప్పింది. సారథిగా బాధ్యతలు చేపట్టిన మొదటి ఏడాదిలోనే ముంబైకి తొలి ఐపీఎల్ టైటిల్‌ను అందించి రోహిత్ సత్తా చాటాటు.

ఏడేళ్లలో 5 టైటిళ్లు..

రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. కేవలం ఏడేళ్ల వ్యవధిలోనే (2013, 2015, 2017, 2019, 2020) ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 5 టైటిళ్లు సాధించిన మొదటి జట్టుగా ముంబై నిలిచింది. రోహిత్ శర్మ కేవలం ఒక ఆటగాడిగానే కాకుండా, డ్రెస్సింగ్ రూమ్‌ను ప్రశాంతంగా ఉంచుతూ యువ ఆటగాళ్లను ప్రోత్సహించే గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us