AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రామీణ వైద్యంలో సరికొత్త చరిత్ర.. మధుసూదన్ సాయి ఫ్రీ మెడికల్ కాలేజీకి జాతీయ స్థాయి గుర్తింపు

సేవకు నాణ్యత తోడైతే అది అద్భుతాలను సృష్టిస్తుందని ముద్దెనహళ్లిలోని శ్రీ మధుసూదన్ సాయి మెడికల్ ఇన్‌స్టిట్యూట్ నిరూపించింది. భారతదేశపు మొట్టమొదటి ఉచిత గ్రామీణ వైద్య కళాశాలగా సంచలనం సృష్టించిన ఈ సంస్థ, ఇప్పుడు జాతీయ స్థాయి నాణ్యతా ముద్రను సొంతం చేసుకుంది. అత్యున్నత ప్రమాణాలకు నిదర్శనమైన NABH గుర్తింపును సాధించి.. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా అందించడంలో సరికొత్త రికార్డు సృష్టించింది.

గ్రామీణ వైద్యంలో సరికొత్త చరిత్ర.. మధుసూదన్ సాయి ఫ్రీ మెడికల్ కాలేజీకి జాతీయ స్థాయి గుర్తింపు
Smsimsr Receives National Nabh Accreditation
Krishna S
|

Updated on: Apr 30, 2026 | 6:38 PM

Share

సేవ మాత్రమే కాదు.. ఆ సేవలో అత్యున్నత నాణ్యత కూడా ఉండాలని నిరూపించింది శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌. భారతదేశపు మొట్టమొదటి ఉచిత గ్రామీణ వైద్య కళాశాలగా పేరుగాంచిన ఈ సంస్థ, ఇప్పుడు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ నుండి ఎంట్రీ-లెవల్ అక్రిడిటేషన్ సాధించి జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. దేశవ్యాప్తంగా దాదాపు 90 వేల ఆసుపత్రులు ఉన్నప్పటికీ, నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో కేవలం 1.4 శాతం మాత్రమే పూర్తి స్థాయి అక్రిడిటేషన్ పొందగా, కేవలం 3 శాతం మాత్రమే ఎంట్రీ-లెవల్ గుర్తింపును సాధించాయి. ఈ నేపథ్యంలో రూపాయి తీసుకోకుండా అత్యున్నత ప్రమాణాలతో వైద్యం అందిస్తూ ఈ గుర్తింపు సాధించడం సామాన్యమైన విషయం కాదని వైద్య నిపుణులు కొనియాడుతున్నారు.

రోగి భద్రతే పరమావధి

ఈ అక్రిడిటేషన్ లభించడం ద్వారా SMSIMSR లో ఈ ప్రమాణాలు పకడ్బందీగా ఉన్నట్లు అర్ధం.

ఇన్‌ఫెక్షన్ కంట్రోల్: ఆసుపత్రి వాతావరణంలో వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు.

రోగి భద్రత: చికిత్స అందించే ప్రతి దశలోనూ రోగి సురక్షితంగా ఉండేలా అత్యున్నత విధానాలు.

పారదర్శకత: వైద్య సేవలు మరియు పరిపాలనలో నైతిక విలువలతో కూడిన పారదర్శక పద్ధతులు.

డాక్యుమెంటేషన్: ప్రతి కేసును క్రమబద్ధంగా పర్యవేక్షించే ఆధునిక యంత్రాంగం.

సద్గురు మార్గదర్శకత్వంలో ప్రపంచమే ఒక కుటుంబం

ఈ విజయంపై సంస్థ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మశ్రీ హర్షం వ్యక్తం చేస్తూ.. “సద్గురు శ్రీ మధుసూదన్ సాయి మార్గదర్శకత్వంలో వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ స్ఫూర్తితో మేము పనిచేస్తున్నాము. పేదలకు ప్రపంచ స్థాయి వైద్యం ఉచితంగా అందించడమే మా లక్ష్యం. ఈ ఎంట్రీ-లెవల్ గుర్తింపు తొలి అడుగు మాత్రమే, త్వరలోనే పూర్తి స్థాయి NABH అక్రిడిటేషన్‌ను కూడా సాధిస్తాము” అని ధీమా వ్యక్తం చేశారు.

వైద్య విద్యార్థులకు వరం

కేవలం రోగులకు మాత్రమే కాకుండా ఇక్కడ చదువుకుంటున్న వైద్య విద్యార్థులకు కూడా ఈ గుర్తింపు ఎంతో మేలు చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పేషెంట్ కేర్ నమూనాలపై వారికి ప్రాక్టికల్ శిక్షణ లభిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో వారు మరింత బాధ్యతాయుతమైన వైద్యులుగా సమాజానికి సేవలందించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అంటే నాణ్యత తక్కువగా ఉంటుందనే అపోహను చెరిపివేస్తూ, వెనుకబడిన వర్గాలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చిన SMSIMSR, ఇప్పుడు ఈ జాతీయ గుర్తింపుతో భారతదేశానికే గర్వకారణంగా నిలిచింది.

Follow Us
తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో ఒక గిన్నెడు ఉప్పు ఎందుకు పెట్టాలో తెలుసా?
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో ఒక గిన్నెడు ఉప్పు ఎందుకు పెట్టాలో తెలుసా?
ఒక్కరోజులోనే మొటిమలు మాయం.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
ఒక్కరోజులోనే మొటిమలు మాయం.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
వివాహానికి రాహువు అడ్డంకిగా మారుతున్నాడా? ఈ జ్యోతిష్య పరిహారాలతో
వివాహానికి రాహువు అడ్డంకిగా మారుతున్నాడా? ఈ జ్యోతిష్య పరిహారాలతో
డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసు: ఏసీబీ దాడుల్లో భారీ ఆస్తులు
డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసు: ఏసీబీ దాడుల్లో భారీ ఆస్తులు
పీఎఫ్ విత్ డ్రా కొత్త రూల్స్.. ఏడాదికి రెండుసార్లు మాత్రమే..
పీఎఫ్ విత్ డ్రా కొత్త రూల్స్.. ఏడాదికి రెండుసార్లు మాత్రమే..
50 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. ఫొటోస్ వైరల్
50 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. ఫొటోస్ వైరల్
వెండి వస్తువులు నల్లగా అయ్యాయా.. ఇంట్లోనే ఇలా చేస్తే నిమిషాల్లోనే
వెండి వస్తువులు నల్లగా అయ్యాయా.. ఇంట్లోనే ఇలా చేస్తే నిమిషాల్లోనే
ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ కథ
ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ కథ
పూజ గదిలో దేవతల విగ్రహాలను ఎలా అమర్చాలి? గణపతికి ఏ స్థానం ఇవ్వాలి
పూజ గదిలో దేవతల విగ్రహాలను ఎలా అమర్చాలి? గణపతికి ఏ స్థానం ఇవ్వాలి