AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయన అహంకారం వల్లే పార్లమెంట్ సమావేశాలు దెబ్బతిన్నాయి: రాహుల్‌ గాంధీపై ప్రహ్లాద్ జోషి ఆగ్రహం..

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్‌ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల చర్చలు, నిర్మాణాత్మక కార్యక్రమాలు సజావుగా సాగలేదని ఆరోపించారు. కేవలం ఒక వ్యక్తి అహంకారం కారణంగానే మొత్తం సమావేశాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. డిమాండ్లను అంగీకరించినప్పటికీ విపక్షాలు వెనక్కి తగ్గకుండా కొత్త డిమాండ్లు తెరపైకి తెస్తున్నాయని ప్రహ్లాద్‌ జోషి విమర్శించారు.

ఆయన అహంకారం వల్లే పార్లమెంట్ సమావేశాలు దెబ్బతిన్నాయి: రాహుల్‌ గాంధీపై ప్రహ్లాద్ జోషి ఆగ్రహం..
Pralhad Joshi
Shaik Madar Saheb
|

Updated on: Aug 13, 2026 | 2:57 PM

Share

ఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. చివరిరోజు కేవలం వందేమాతర గీతాలాపనకు లోక్‌సభ పరిమితమైంది.. అనంతరం లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. రాజ్యసభలో కాసేపు చర్చ నడిచింది. విపక్షాల ఆందోళన కారణంగా సభను స్పీకర్‌ ఓంబిర్లా నిరవధికంగా వాయిదా వేశారు. 19 రోజుల పాటు లోక్‌సభ సమావేశాలు జరిగాయి. లోక్‌సభ వాయిదా తరువాత స్పీకర్‌ ఏర్పాటు చేసిన తేనీటి విందుకు విపక్షాలు హాజరుకాలేదు. అయితే, డీఎంకే ఎంపీ కనిమొళి మాత్రం స్పీకర్‌ తేనీటి విందుకు హాజరయ్యారు. కాగా.. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు, నిరవధిక వాయిదాపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. వర్షాకాల సమావేశాల సమయంలో రాహుల్ గాంధీ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు.

వర్షాకాల సమావేశాల సమయంలో రాహుల్ గాంధీ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల, ఆమోదించబడిన బిల్లులు మినహా, జరగాల్సిన ఇతర చర్చలు, నిర్మాణాత్మక పనులు జరగకుండా పోయాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కేవలం ఒక వ్యక్తి అహంకారం వల్లే మొత్తం సమావేశాలు దెబ్బతిన్నాయన్నారు. వారు డిమాండ్లు చేస్తారు, ఆ డిమాండ్లను అంగీకరించినప్పుడు అక్కడి నుండి పారిపోతారంటూ విమర్శించారు. వారం రోజుల క్రితం, హోం మంత్రి సమాధానం ఇస్తారని కిరణ్ రిజిజు పార్లమెంటులో చెప్పారు.. ఆ హామీ ఇచ్చినప్పటికీ, వారు దానిని అంగీకరించలేదు. నిన్న స్వయంగా హోం మంత్రి మాట్లాడినప్పుడు కూడా, వారు తమ డిమాండ్లను మార్చి ఆయన రాజీనామాను కోరారంటూ విమర్శించారు.

వీడియో చూడండి..

అలాంటి వారు జార్ఖండ్‌కు ఎందుకు వెళ్లడం లేదు?… మీ సొంత మంత్రులను మీరు ఎందుకు హెచ్చరించడం లేదు? రాహుల్ గాంధీ వ్యవహారశైలిలో పక్షపాతం.. అహంకారం కనిపిస్తాయి.. ప్రభుత్వ రాజ్యాంగపరమైన విధానాలను విస్మరించి, పార్లమెంటు తన ఇష్టానుసారమే నడవాలని ఆయన కోరుకుంటున్నారు.. అంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తచేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..
ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..
సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!
సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?
గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు
గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు
ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!
ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!