వేడి వేడి ములక్కాడల సూప్.. ఇలా తాగితే ఆ రోగాలన్నీ మాయం

Samatha

23 september 2026

Pic credit - Pinterest

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే ఆరోగ్యం విషయంలో తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు.

అయితే ఒక్కసారి వర్షం పడినా సరే చాలా మంది దగ్గు జలుబు వంటి అనేక రకాల ఇన్ఫెక్షన్స్‌తో బాధపడి పోతుంటారు.

అలాంటి వారికే ఈ అద్భుతమైన రిసీపీ. దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే వారు ప్రతి రోజూ  ములక్కాడల సూప్ తాగాలంట.

ప్రతి రోజూ ఒక గ్లాస్ ములక్కాడల సూప్ తాగడం వలన ఇది దగ్గు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మీకు పూర్తిగా ఉపశమనం కలిగేలా చేస్తుందంట.

దీనిని ఉల్లిపాయలు, టమాటా, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర , పసుపు, నూనె, నీళ్లు వేసి కాస్త ఘాటుగా తయారు చేసుకోవాలి.

మునక్కాయలో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.

ములక్కాడల సూప్ ప్రతి రోజూ తాగడం వలన ఇందులో ఉండే అధిక ఫైబర్ మలబద్ధకం సమస్య ఉండదు. కడుపు తేలికగా, హాయిగా ఉంటుంది.

అంతే కాకుండా ములక్కాడలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనత తో బాధపడేవారికి చాలా మంచిది. రక్తం పెరుగుతుంది, నీరసం తగ్గుతుంది.