AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తిరుమలలో తళుక్కుమన్న ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎవరో గుర్తు పట్టారా? ఎన్టీఆర్, వెంకీలతో సూపర్ హిట్స్

ఒకప్పుడు పలు తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు తీర్చుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.

Tollywood: తిరుమలలో తళుక్కుమన్న ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎవరో గుర్తు పట్టారా? ఎన్టీఆర్, వెంకీలతో సూపర్ హిట్స్
Greeshma Nethrikaa
Basha Shek
|

Updated on: Aug 13, 2026 | 2:54 PM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు టాలీవుడ్ ఛైల్డ్ ఆర్టిస్ట్. ఒకటి కాదు.. రెండు కాదు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఏకంగా 30కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. బాలకృష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్, సిద్ధార్థ్, అక్కినేని సుమంత్, శర్వానంద్, అనుష్క.. ఇలా తెలుగులో ఎంతో మంది స్టార్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. చిన్న తనంలోనే తన క్యూట్ యాక్టింగ్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే మధ్యలో చదువు కారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోందీ అందాల తార. ఒకప్పుడు ఛైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హీరోయిన్ గా అలరించేందుకు రెడీ అవుతోంది. అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోస్ ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ క్యూటీ ఫొటోలకు నెటిజన్ల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తిరుమలలో తళుక్కుమంది. తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం తన తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇన్ స్టా గ్రామ్ లో చాలా గ్లామరస్ గా మోడ్రన్ దుస్తుల్లో కనిపించే ఈ క్యూటీ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో మాత్రం చాలా పద్దతిగా ట్రెడిషినల్ దుస్తుల్లో తళుక్కుమంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు ‘గ్రీష్మ నేత్రిక’. ఇలా పేరు చెబితే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ మల్లీశ్వరి సినిమా ఛైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఒక అందమైన రూపం మన కళ్ల ముందు మెదులుతుంది. ఈ సూపర్ హిట్ సినిమాలో వెంకీ అన్న కూతురిగా తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది గ్రీష్మ. మూడు ఏళ్ల ప్రాయంలోనే ‘అమ్ములు’ అనే చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది గ్రీష్మ. ఆ తర్వాత మల్లీశ్వరి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఎన్టీఆర్ ‘అశోక్’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘ప్రస్థానం’, ‘పంచాక్షరి’, ‘ఏమో గుర్రం ఎగరవచ్చు’ వంటి పలు చిత్రాల్లోనూ గ్రీష్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది. నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్: మహానాయకుడు’ చిత్రంలోనూ బసవతారకం చిన్నప్పటి పాత్రను కూడా ఈ క్యూటీనే పోషించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

మల్లీశ్వరి సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా..

కాగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా సక్సెస్ అందుకున్న గ్రీష్మ, ఇప్పుడు హీరోయిన్‌గానూ తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇన్ స్టా గ్రామ్ లో తరచూ తన గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తోంది. ఆమె సోషల్ మీడియా పోస్టులకు అభిమానుల నుంచి, నెటిజన్ల నుంచి కూడ మంచి స్పందన లభిస్తోంది. అన్నట్లు చదువుకునే వయసులోనే క్లాసికల్ డ్యాన్స్ (కూచిపూడి) కూడా నేర్చుకుంది గ్రీష్మ. అలాగే స్క్రిప్ట్ రైటింగ్ , స్టోరీ టెల్లింగ్ పట్ల కూడా ఈ బ్యూటీకి ఆసక్తి ఉంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us