Annapurna Studio: అన్నపూర్ణ స్టూడియోకు శంకుస్థాపన రాయి వేసింది ఎవరో తెలుసా.. ? ఆ చిన్నోడు క్రేజీ హీరో..
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) గారు తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాసు (చెన్నై) నుండి హైదరాబాద్‌కు తరలించాలనే గొప్ప సంకల్పంతో ఈ స్టూడియోను స్థాపించారు. ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారి పేరు మీదుగా దీనికి 'అన్నపూర్ణ స్టూడియోస్' అని నామకరణం చేశారు.

తెలుగు సినీ రంగానికి మైలురాయిగా నిలిచిన అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) స్థాపించి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఒకప్పుడు చెన్నై (మద్రాసు) కేంద్రంగా ఉన్న తెలుగు చలనచిత్ర పరిశ్రమను తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరమైన హైదరాబాద్‌కు తరలించడంలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్) వహించిన పాత్ర అత్యంత కీలకమైనదనే చెప్పాలి. అయితే అప్పటికీ ఇక్కడ సినిమాకు ఎలాంటి సదుపాయాలు అందుబాటులో లేవు. అలాంటి సమయంలో అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ కోసం పునాది వేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ కోసం హైదరాబాద్ మహానగరంలో మొదటి స్టూడియో శంకుస్థాపన చేశారు. ఈ స్టూడియో స్థాపించి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నాం.. అప్పుడే విడిపోవాలని అనుకున్నాం.. టాలీవుడ్ నటి..
1975 ఆగస్టు 13న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అన్నపూర్ణ స్టూడియోస్‌కు శంకుస్థాపన జరిగింది. అప్పటికి ఆ ప్రాంతం కేవలం రాళ్లు, రప్పలతో నిండిన ఒక బీడు భూమి. అయితే తెలుగు చిత్ర పరిశ్రమకు భాగ్యనగరంలో సొంత చిరునామా ఉండాలనే సంకల్పంతో ఏఎన్ఆర్ ఈ స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శంకుస్థాపన సమయంలో తీసిన ఒక అరుదైన పాత ఫోటోను ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అందులో ఏఎన్ఆర్ సతీమణి అన్నపూర్ణమ్మ గారు ఒక చిన్నారి చేతుల మీదుగా శంకుస్థాపన రాయి వేయించడం కనిపిస్తుంది. ఆ ఫొటోలో ఉన్న చిన్నోడు మరెవరో కాదు, ప్రముఖ టాలీవుడ్ కథానాయకుడు సుమంత్ . అక్కినేని నాగేశ్వరరావు మనవడైన సుమంత్, చిన్నతనంలోనే ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగమయ్యారు.
ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..
బీడు భూమిగా ఉన్న ఆ ప్రాంతం నేడు భారతీయ సినీ రంగంలోనే అత్యంత ఆధునిక సదుపాయాలు కలిగిన సృజనాత్మక కేంద్రంగా రూపాంతరం చెందింది. ఎన్నో సంచలనాత్మక సినిమాలు, టీవీ సీరియళ్లు, రియాలిటీ షోల చిత్రీకరణలు ఇక్కడే జరుగుతాయి. స్టూడియో ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) వంటి అధునాతన సాంకేతిక సేవలకు అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా నిలిచింది. ఏఎన్ఆర్ కన్న కల నెరవేరుతూ, ఐదు పదుల కాలంగా తెలుగు సినిమా వికాసానికి అన్నపూర్ణ స్టూడియోస్ వారధిగా కొనసాగుతోంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..
సుమంత్ ఫోటో..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..
