AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. కొద్దిదూరం వెళ్లగానే

కోల్‌కతాలో ఒక ఘోర ప్రమాదం వెలుగు చూసింది. డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కారుపై నియంత్రణ తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో.. అందులో ఉన్న 42 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Viral News: డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. కొద్దిదూరం వెళ్లగానే
Kolkata Woman Drowns Pond
Anand T
|

Updated on: Aug 13, 2026 | 12:39 PM

Share

డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కారు నియంత్రణ కోల్పోయి 42 ఏళ్ల మహిళ మరణించిన ఘటన కోల్‌కతాలో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాలోని కెస్టోపూర్‌, ప్రఫుల్ల కానన్ ప్రాంతానికి చెందిన సుమిత్రా దాస్ (42) కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఇటీవల తన కూతురిని స్కూల్‌ వద్ద దింపి స్కూటీపై ఇంటికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత స్కూటీని ఇంట్లో పార్క్ చేసి, డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయడం కోసం షెడ్డులో ఉన్న తన హ్యుందాయ్ ఇయాన్ కారును బయటకు తీసింది.

ఇంటి నుంచి కొద్ది దూరం వరకు బాగానే డ్రైవ్ చేసింది. కానీ మార్గమధ్యలో ఉన్న ఒక చెరువు వద్దకు రాగానే కారుపై నియంత్రణ కోల్పోయింది. దీంతో కారు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లి నీటిలో మునిగిపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నీటిలో మునిగి ఊపిరాడక ఆమె అక్కడికక్కడే మరణించింది.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది.. క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. అందులో చిక్కుకున్న సుమిత్ర మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే
రో-కో కంటే డేంజరస్ అతను.. మావోళ్లకు బడితపూజే..!
రో-కో కంటే డేంజరస్ అతను.. మావోళ్లకు బడితపూజే..!
పీడకలలు ఎందుకు వస్తాయి? శాస్త్రం చెప్పే అసలు కారణాలు, పరిహారాలు..
పీడకలలు ఎందుకు వస్తాయి? శాస్త్రం చెప్పే అసలు కారణాలు, పరిహారాలు..
ఆయన గ్రేట్ హీరో.. మాటల్లో చెప్పలేని అద్భుతమైన నటుడు..
ఆయన గ్రేట్ హీరో.. మాటల్లో చెప్పలేని అద్భుతమైన నటుడు..
హర్భజన్‌కు శ్రీశాంత్‌ రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!
హర్భజన్‌కు శ్రీశాంత్‌ రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!
వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందంటే
వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందంటే
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..
ప్రాక్టీస్‌తోనే పవర్ ఫుల్ మెసేజ్ పంపిన టీమిండియా యమ కింకరుడు..
ప్రాక్టీస్‌తోనే పవర్ ఫుల్ మెసేజ్ పంపిన టీమిండియా యమ కింకరుడు..
ఒక్క సినిమాతో మారిపోయిన జాతకం.. మరో స్టార్ హీరో మూవీలో వామికా
ఒక్క సినిమాతో మారిపోయిన జాతకం.. మరో స్టార్ హీరో మూవీలో వామికా