నాందేడ్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి.. చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు!
మహారాష్ట్రలోని నాందేడ్‌లో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి జరిగింది. ఘటన అనంతరం ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

నాందేడ్ (ఆగస్టు 13): మహారాష్ట్రలోని నాందేడ్‌లో శిరోమణి అకాలీ దళ్ (SAD) జాతీయ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి జరిగింది. తన కుటుంబ సభ్యులతో కలిసి గురుద్వారా మాతా సాహిబ్ కౌర్‌లో పూజలు చేసేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఓ నిహంగ్ సిక్కు కిర్పాన్‌తో బాదల్‌పై దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో బాదల్ భద్రతా సిబ్బంది కూడా అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన సందర్భంగా వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దాడిలో బాదల్ చేతికి గాయమైంది. దాడి జరిగిన వెంటనే ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు స్పాట్‌కు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో గురుద్వారా పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సమాచారం. దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరు, అతడి ఉద్దేశం ఏమిటి, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, నాందేడ్‌లోని హజూర్ సాహిబ్ గురుద్వారా సిక్కు సమాజానికి అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి. ఇది సిక్కు మతంలోని ఐదు తఖ్త్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
