AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్నడ నటుడేమో అనుకున్న.. మన తెలుగోడే.. దేశంలో బెస్ట్ యాక్టర్ అవుతాడు..

మెగాస్టార్ చిరంజీవి స్వశక్తితో పైకి వచ్చిన యాక్టర్. ఆయన తనను తాను చెక్కుకున్నారు. తననే ఒక బ్రాండ్‌గా క్రియేట్ చేసుకున్నారు. చిరు డ్యాన్స్ అన్నా.. డైలాగ్ అన్నా.. బాస్ గ్రేస్ అన్నా.. ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. అలాంటి చిరు ఓ టాలీవుడ్ నటుడి గురించి చాలా మంచి మాటలు చెప్పారు.

కన్నడ నటుడేమో అనుకున్న.. మన తెలుగోడే.. దేశంలో బెస్ట్ యాక్టర్ అవుతాడు..
Chiranjeevi
Ram Naramaneni
|

Updated on: Apr 30, 2026 | 7:37 PM

Share

మెగాస్టార్ చిరంజీవి నటుడు సత్యదేవ్ నటన సామర్థ్యంపై గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో నిత్యం చర్యకు వస్తూనే ఉంటాయి. సత్యదేవ్‌ను గాడ్ ఫాదర్ సినిమా కోసం ప్రతినాయకుడి పాత్రకు ఎలా ఎంపిక చేశారనే విషయాన్ని చిరంజీవి వివరించారు. తాను మొదట సత్యదేవ్ నటించిన చిత్రాలను ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో వీక్షించినట్లు ఆయన తెలిపారు. కోవిడ్ వ్యాప్తి సమయంలో రాగల 24 గంటల్లో, బ్లఫ్ మాస్టర్ వంటి చిత్రాలను చూసి సత్యదేవ్ నటనకు ఆశ్చర్యపోయానని చిరంజీవి పేర్కొన్నారు. ఆ సమయంలో సత్యదేవ్ తెలుగు నటుడు కాదేమో, బహుశా కన్నడ నటుడు అయి ఉంటాడని తన గంభీరమైన వాయిస్ కారణంగా భావించానని ఆయన తెలియజేశారు. అతని నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని, అందుకే ఖాళీగా ఉన్నప్పుడు అతన్ని ఇంటికి పిలిచానని చిరంజీవి చెప్పారు. అప్పుడే సత్యదేవ్ తెలుగువాడని, అంతేకాకుండా తనకి పెద్ద అభిమాని (ఫ్యాన్‌బాయ్) అని తెలిసి తాను సంతోషించానని మెగాస్టార్ పంచుకున్నారు.

గాడ్‌ఫాదర్ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర కోసం నటుడిని ఎంపిక చేస్తున్న సమయంలో, ఇతర భాషల నుంచి నటులను తీసుకురావాలని చర్చ జరుగుతున్నప్పుడు, తాను ఆ ప్రతిపాదనను వ్యతిరేకించానని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. “మన తెలుగులో అద్భుతమైన ప్రతిభావంతులు ఉన్నారు, నేను సత్యదేవ్ పేరును సూచించాను” అని ఆయన అన్నారు. దర్శకుడు కూడా సత్యదేవ్ ఎంపికకు అంగీకరించారని, అయితే కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో, మళ్ళీ తాను సత్యదేవ్ పేరే ప్రస్తావించి ఖరారు చేయించినట్లు చిరంజీవి స్పష్టం చేశారు. సత్యదేవ్‌కు కథ చెప్పినప్పుడు, అతను ఒక హీరోగా చేస్తూ, మళ్ళీ విలన్ పాత్ర చేయమంటే ఎలా అని ఆలోచించాడని తాను గ్రహించానని చిరంజీవి వివరించారు. హీరోగా ఉన్న రోజుల్లో తాను కూడా కొన్ని విలన్ పాత్రలు చేసినప్పుడు ఇదేవిధంగా మధనపడిన సందర్భాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే, ప్రతినాయకుడి పాత్ర అయినా సరే, ఇది ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ అని, ఇది అతని కెరీర్‌కు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పి సత్యదేవ్‌ను ఒప్పించినట్లు చిరంజీవి తెలిపారు.

కెమెరా ఆఫ్ ఉన్నప్పుడు చేతులు కట్టుకొని ప్రశాంతంగా కూర్చునే సత్యదేవ్, కెమెరా ఆన్ అయిన తర్వాత పూర్తిగా విజృంభిస్తాడని చిరంజీవి ప్రశంసించారు. “ఆయన ఒక దుర్మార్గమైన నటుడు. ఆయన అద్భుతమైన నటన కనబరిచారు.. అతను కేవలం తెలుగు నటుడు మాత్రమే కాదు, ఒక ఇండియన్ యాక్టర్‌గా పేరు సంపాదించుకుంటాడు” అని మెగాస్టార్ చిరంజీవి సత్యదేవ్ భవిష్యత్తు గురించి గొప్ప అంచనాలను వెల్లడించారు. “ఇది మామూలు విషయం కాదు. రేపు పొద్దున మీరే అంటారు, పేపర్లే చెప్తాయి, మీడియా రాస్తుంది. అతనిలో ఒక దాగి ఉన్నటువంటి అద్భుతమైన నటుడు ఉన్నాడు” అని మెగాస్టార్ అన్నారు.

Chiranjeevi Satya Dev

Chiranjeevi – Satya Dev

సావిత్రి చేసిన పనికి కోపంతోనే ఆమె చివరి చూపుకు కూడా వెళ్లలేదు… 

Follow Us