హీరోయిన్‏గా కాంట్రావర్సి నటి కూతురు.. మెంటలెక్కిస్తోన్న జోవిక..

Rajitha Chanti

Pic credit - Instagram

30 April 2026

తమిళ సినీ రంగంలో నిత్యం వార్తల్లో నిలిచే నటి వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎక్కువగా వ్యక్తిగత విషయాలతో హాట్ టాపిక్ అవుతుంది. 

సీనియర్ నటుడు విజయ్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె, తన నటనతో, సామాజిక అంశాలపై తన గళాన్ని వినిపిస్తూ ఎప్పుడూ చర్చల్లో ఉంటారు.

తాజాగా ఆమె కుమార్తె జోవిక విజయ్ కుమార్ వెండితెరకు పరిచయం కాబోతున్నారు. 'అగాధ' (Agadha) అనే చిత్రంతో ఆమె హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తుంది. 

 జోవిక ఇప్పటికే తమిళ బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ షోలో ఆమె తన వ్యక్తిత్వాన్ని, ధైర్యాన్ని చాటుకుని ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తారని అందరూ ఊహించినట్లుగానే, ఇప్పుడు 'అగాధ' సినిమాతో కథానాయికగా మారుతుంది. 

ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదలైన పోస్టర్లు, అప్‌డేట్స్ కోలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 'అగాధ' చిత్రం ఒక వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్నట్లు సమాచారం.

ఈ సినిమాను సురేష్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. జోవిక తన మొదటి సినిమాలోనే ఒక ఛాలెంజింగ్ పాత్రను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

తన తల్లి వనితలాగే జోవిక కూడా నటనలో తనదైన ముద్ర వేయాలని గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఆమె బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకోనున్నాయి.