నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. అప్పుడే ప్రశాంతంగా ఉంటా.. త్రిష..

Rajitha Chanti

Pic credit - Instagram

30 April 2026

దక్షిణాది చిత్రపరిశ్రమలో రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా రాణిస్తున్న హీరోయిన్ త్రిష. వయసు పెరుగుతున్నా తన గ్లామర్‌తో, నటనతో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తుంది.

ఈ చెన్నై చంద్రం, తాజాగా తన వ్యక్తిగత అలవాట్ల గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన నిద్రకు సంబంధించిన విషయాలు పంచుకుంది.

నాలుగు పదుల వయసులోనూ పెళ్లికి దూరంగా ఉంటూ.. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో తెలుగు, తమిళ చిత్రపరిశ్రమలో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ క్రమంలో తాజాగా త్రిష తన్ ఇన్ స్టాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. తాను ప్రస్తుతం నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు చెప్పుకొచ్చింది.

ఒక గంట నిద్ర కోల్పోతే దాని నుంచి రికవరీ కావడానికి దాదాపు  4 రోజులు పడుతుంది. ఈ ప్రకారం లెక్కలు కడితే 2062లోనే ప్రశాంతగా ఉంటానేమో అని అన్నారు. 

అంటే త్రిష మాటల్లోని అర్థం పై ఇప్పుడు సర్వత్రా చర్చకు దారి తీసింది. ఆమెకు నిద్ర పట్టడం లేదా.. ఆమె మానసిక రుగ్మతకు లోనౌతున్నారా అనే ప్రశ్నలు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు త్రిష చేసిన కామెంట్స్ అటు రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులో మే 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం త్రిష చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా త్రిష , హీరో విజయ్ స్నేహం గురించి ఫిల్మ్ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి.