AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mega Summer: సమ్మర్ బాక్సాఫీస్‌కు మెగా హీరోల క్యూ.. రిలీజ్ డేట్స్‌తోనే అభిమానులకు చెమటలు పట్టిస్తున్న చిరంజీవి

2026 సంక్రాంతి బరిలో ఆ ‘సుప్రీమ్’ హీరో తన మాస్ పవర్ తో ఏకంగా 375 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఆ వేడి ఇంకా తగ్గకముందే, ఇప్పుడు సమ్మర్ సీజన్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని ఆ ఫ్యామిలీ ఫిక్స్ అయిపోయింది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు, అటు హీరోలుగా.. ఇటు నిర్మాతలుగా బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి లైన్ కట్టేశారు.

Mega Summer: సమ్మర్ బాక్సాఫీస్‌కు మెగా హీరోల క్యూ.. రిలీజ్ డేట్స్‌తోనే అభిమానులకు చెమటలు పట్టిస్తున్న చిరంజీవి
Ustaad Bhagathsingh & Viswambhara
Nikhil
|

Updated on: Feb 08, 2026 | 11:43 AM

Share

ఆ కాంపౌండ్​ నుంచి ఒక్క హీరో సినిమా వస్తేనే బాక్సాఫీస్ రికార్డులు తలకిందులు అవుతాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఐదుగురు ఒకేసారి దండయాత్రకు సిద్ధమైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. 2026 సంక్రాంతి బరిలో ఆ ‘సుప్రీమ్’ హీరో తన మాస్ పవర్ తో ఏకంగా 375 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఆ వేడి ఇంకా తగ్గకముందే, ఇప్పుడు సమ్మర్ సీజన్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని ఆ ఫ్యామిలీ ఫిక్స్ అయిపోయింది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు, అటు హీరోలుగా.. ఇటు నిర్మాతలుగా బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి లైన్ కట్టేశారు. మార్చిలో మొదలై జులై వరకు ప్రతి నెలా ఒక మెగా బాంబ్ థియేటర్లలో పేలబోతోంది. ఇంతకీ ఆ ఐదు క్రేజీ ప్రాజెక్టులు ఏంటి?

బాక్సాఫీస్ కింగ్..

2026 సంక్రాంతి సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ ను ఒక ఊపు ఊపేశారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఏకంగా రూ.375 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్ లో సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ తో మెగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉండగా, ఇప్పుడు సమ్మర్ రేసులో కూడా మెగా ఫ్యామిలీ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు ఈ వేసవిలో ప్రేక్షకులను పలకరించబోతున్నాయి.

పవర్ స్టార్ తో మొదలు..

ఈ సమ్మర్ సీజన్ ను మెగా ఫ్యామిలీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రాండ్ గా మొదలుపెట్టబోతున్నారు. ఆయన హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా చేసే రచ్చ చూడటానికి ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మార్చి నెలాఖరున పవర్ స్టార్ తన పవర్ చూపించడానికి సిద్ధంగా ఉన్నారు.

మెగా పవర్ స్టార్ ఎంట్రీ..

పవన్ కళ్యాణ్ తర్వాత మెగా డాటర్ నిహారిక కొణిదెల తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘రాకాస’ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది. సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఇక ఏప్రిల్ నెలాఖరున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంతు రాబోతోంది. ఆయన హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Korean Kanakaraju, Rakaasa & Peddi

Korean Kanakaraju & Peddi

విశ్వంభర, కొరియన్ కనకరాజు..

వేసవి వేడి ముగిసేలోపు మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశ్వరూపం చూపించబోతున్నారు. వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ‘విశ్వంభర’ జులైలో విడుదల కానుందని సమాచారం. భారీ గ్రాఫిక్స్ తో ఇంటర్నేషనల్ లెవల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తన వంతుగా ‘కొరియన్ కనకరాజు’తో సమ్మర్ లో సందడి చేయబోతున్నారు. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ కు చాలా కీలకం కానుంది. ఒకే సీజన్ లో ఒకే ఫ్యామిలీ నుంచి ఐదు సినిమాలు రావడం అనేది టాలీవుడ్ లో ఒక సంచలనం అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి, వరుణ్ తేజ్, నిహారిక.. ఇలా అందరూ కలిసి సమ్మర్ బాక్సాఫీస్ పై మెగా ముద్ర వేయబోతున్నారు.

Follow Us