బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో పెద్ద తప్పు.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
కొన్ని కాంబినేషన్లు హిట్ చిత్రాలను అందిస్తే.. మరికొన్ని కాంబినేషన్లు అట్టర్ ప్లాప్ సినిమాలు అందిస్తాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇది సర్వసాధారణం. మరి అలాంటి ఓ కాంబో గురించి ఇప్పుడు తెలుసుకుందామా. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.

అనుష్క శెట్టి.. టాలీవుడ్‌కు ఈ పేరు సుపరిచితమే. అందం, అభినయంతో ఎంతోమంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న స్వీటీ. తెలుగులో ‘సూపర్’ చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆపై ‘అరుంధతి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా మంచి బిజినెస్ తెచ్చిపెట్టింది అనుష్క. ఇక ప్రభాస్, అనుష్క కాంబినేషన్ అయితే ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పొచ్చు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మిర్చి’, ‘బాహుబలి 1 & 2’ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఇక తన కెరీర్‌లో ఓ పెద్ద మిస్టేక్ చేశానని అనుష్క గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తన కెరీర్‌లో పెద్ద తప్పు.. ఓ సినిమా చేయడమేనని.. ఆ సినిమా చేసి ఉండకూడదని పేర్కొంది. మరి ఆ సినిమా ఏంటంటే.?
‘ఒక్క మగాడు’.. 2008లో విడుదలైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందమూరి బాలకృష్ణ హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. అలాగే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్ అయింది. బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మారింది. అప్పట్లో బాలకృష్ణ – వైవియస్ చౌదరి కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉండటంతో.. అనుష్క ఈ సినిమాను పూర్తి కథ వినకుండానే ఓకే చెప్పిందట. అలాగే తన పాత్ర స్కోప్ ఎంతుందో కూడా తెలుసుకోకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ విషయం స్వయంగా ఓ ఇంటర్వ్యూలో అనుష్క వెల్లడించింది.
ఈ సినిమాలోని ఓ పాటలో అనుష్క బోల్డ్‌గా కనిపించింది. ఇప్పటికీ ఆ పాటతో స్వీటీ తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది అనడంలో అతిశయోక్తి కాదు. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. బాలకృష్ణతో నటించడం తనకు ఓ మంచి అనుభవమని.. ఆయన చాలా మంచి మనిషి అని అనుష్క పేర్కొంది. ఆ సినిమా తర్వత నుంచి కథ, తన పాత్ర నిడివి తెలుసుకోకుండా ఏ సినిమా ఒప్పుకోలేదని.. ఆపై తన సినిమాల ఎంపిక మరింత జాగ్రత్తగా ఉండేదని తెలిపింది. కాగా, ఇండస్ట్రీలో ప్రభాస్, అనుష్క మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఈ ఇద్దరి మధ్య పెళ్లి వార్తలు చాలానే చక్కర్లు కొట్టాయి. ఇద్దరూ బ్యాచిలర్స్ కావడంతో ఇవన్నీ హల్చల్ చేయగా.. అవన్నీ వట్టి పుకార్లేనని ఇద్దరూ కొట్టిపారేశారు. ప్రస్తుతం ప్రభాస్, అనుష్క.. వారి వారి ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




