చిత్తూరు జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. హేమ అనే యువతి ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఆమె తల్లిదండ్రులు బతికుండగానే ఆమెకు కర్మకాండలు నిర్వహించారు. కూతురి ఫోటోకు దండ వేసి, బంధుమిత్రులను పిలిచి భోజనాలు ఏర్పాటు చేస్తూ, తమ బిడ్డ చనిపోయిందని ప్రకటించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారి, తల్లిదండ్రులు, అమ్మాయి చర్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.