ముక్కుపుడకల పట్ల మహిళలకున్న మక్కువ అందం కోసమే. అయితే వాటిని ధరించే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఒక మహిళ ముక్కుపుడక పొరపాటున ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయిన ఘటనను ఒక ఎక్స్రే నివేదిక ద్వారా వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై అవగాహనతో ఉండాలని సూచించారు.