AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతులకు ఎగిరిగంతేసే వార్త.. ఇక కూర్చున్న చోట నుంచే లక్షల్లో ఆదాయం.. ఎలాగంటే.?

టైటిల్ చూసి ఇదేదో తప్పు అని అనుకోవద్దు. కరెక్టే.! రైతులకు ఎగిరి గంతేసే వార్త.. ఇక పొలాల నుంచే కాలి మీద కాలేసుకుని కూర్చుని లక్షల్లో ఆదాయాన్ని వెనకేసుకుని ఉండొచ్చు. మరి అదెలాగో అని మీరు అనుకుంటున్నారా.? అయితే ఈ వార్త ఓసారి చదివేయండి మరి.

రైతులకు ఎగిరిగంతేసే వార్త.. ఇక కూర్చున్న చోట నుంచే లక్షల్లో ఆదాయం.. ఎలాగంటే.?
Farmers
Prabhakar M
| Edited By: |

Updated on: Dec 19, 2025 | 1:15 PM

Share

పంటల సాగుతో పాటు గ్రీన్ ఎనర్జీ ద్వారా కూడా రైతులకు ఆదాయం వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కుసుం(PM-KUSUM) పథకాన్ని రాష్ట్రంలో వేగంగా అమలు చేస్తూ రైతుల పొలాల్లోనే సౌర విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా 1,450 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా రెడ్కో కార్యాచరణ ప్రారంభించింది. వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములను ఆదాయ మార్గంగా మార్చాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. రైతులు తమ భూముల్లో ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను డిస్కంలకు అమ్మి దీర్ఘకాలికంగా స్థిర ఆదాయం పొందే అవకాశం ఏర్పడింది.

883 మంది రైతులతో ఒప్పందాలు

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 883 మంది రైతులు డిస్కంలతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు (PPA) కుదుర్చుకున్నారు. వీరి ద్వారా సుమారు 4,500 ఎకరాల భూమిలో రూ.6 వేల కోట్ల పెట్టుబడితో సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి విద్యుత్ సరఫరా ప్రారంభించాలన్నది రెడ్కో లక్ష్యంగా పెట్టుకుంది.

0.5 నుంచి 2 మెగావాట్ల వరకు అవకాశం

పీఎం కుసుం పథకం కింద రైతులు 0.5 మెగావాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. భూమి పరిస్థితులను బట్టి అవసరమయ్యే ఎకరాల సంఖ్య మారుతుంది. సాధారణంగా 0.5 మెగావాట్లకు రెండు ఎకరాల లోపు, ఒక మెగావాట్లకు మూడు నుంచి నాలుగు ఎకరాలు, రెండు మెగావాట్లకు సుమారు ఏడు ఎకరాల భూమి అవసరం అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది.. 10 నిమిషాల్లోనే.!

బ్యాంకు రుణాలకు కేంద్ర రాయితీ

ఈ ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడిలో రైతులు కేవలం 15 నుంచి 20 శాతం మార్జిన్ మనీ చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తం బ్యాంకులు రుణంగా అందిస్తున్నాయి. సాధారణంగా బ్యాంకు రుణాలకు 9 శాతం వడ్డీ ఉండగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం 3 శాతం వడ్డీ సబ్సిడీ ఇస్తోంది. అయితే రుణం తీసుకునే రైతులు తమ భూమిని బ్యాంకు పేరిట మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది.

25 ఏళ్ల పాటు స్థిర ఆదాయం

ఈ పథకంలో చేరిన రైతులు సుమారు 25 ఏళ్ల పాటు తమ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ కొనుగోలు చేస్తాయి. స్థానిక సబ్ స్టేషన్ల నుంచి ప్రత్యేక లైన్ల ద్వారా విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు.

యూనిట్‌కు రూ.3.13 చెల్లింపు

పీఎం కుసుం పథకం కింద ఉత్పత్తి చేసే ప్రతి యూనిట్‌కు డిస్కంలు రూ.3.13 చొప్పున రైతులకు చెల్లించనున్నాయి. ఒక మెగావాట్ల సోలార్ ప్లాంట్ ద్వారా ఏడాదికి సుమారు 16.5 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. దీని ద్వారా రైతు ఖాతాలో ఏడాదికి రూ.52 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఖర్చులు పోయినా లాభమే

మెయింటెనెన్స్, నిర్వహణ కోసం ఏడాదికి రూ.6 నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చైనా, రైతుకు నికరంగా రూ.40 లక్షలకు పైగా ఆదాయం మిగులుతుందని అంచనా. దీంతో బ్యాంకు ఈఎంఐలు సైతం సులభంగా చెల్లించే పరిస్థితి ఉంటుంది.

గ్రీన్ ఎనర్జీ లక్ష్యానికి తోడ్పాటు

2047 నాటికి పూర్తిగా గ్రీన్ ఎనర్జీపై ఆధారపడాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ పథకం బలంగా తోడ్పడనుంది. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, రాష్ట్రంలో పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని పెంచే దిశగా పీఎం కుసుం కీలకంగా మారుతోంది.

ఇది చదవండి: నన్నైతే అమ్మ, తమ్ముడు ముందే బట్టలు విప్పి చూపించమన్నారు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..