AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Sale: రూ. 10 లక్షల పెట్టి కారు కొంటున్నారా.? అయితే ప్రభుత్వం మీకు డబ్బులు ఇస్తుంది.. ఎలాగంటే.?

మీరు కొత్త కారు కొంటున్నారా.? ధర రూ. 10 లక్షలు దాటిందా.? అయితే మీకు 1 శాతం టీసీఎస్ వర్తిస్తుంది. ఈ విషయం గురించి చాలామందికి తెలియదు. కారు కొనేటప్పుడు డీలర్ నుండి ఫారం 27D తీసుకోండి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.

Car Sale: రూ. 10 లక్షల పెట్టి కారు కొంటున్నారా.? అయితే ప్రభుత్వం మీకు డబ్బులు ఇస్తుంది.. ఎలాగంటే.?
Ravi Kiran
|

Updated on: Dec 18, 2025 | 11:57 AM

Share

కొత్త కారు కొనాలని చూస్తున్నారా.? న్యూ కారు కొనడం ఇప్పుడు చాలామంది కల. తమ శాలరీని పొదుపు చేసుకుంటూ.. ఉద్యోగులైనా, వ్యాపారస్తులైనా ఈఎంఐ పెట్టుకుని మరీ మంచి కార్లను తీసుకోవాలని చూస్తారు. సరికొత్త ఫీచర్లు, మెరుగైన భద్రత కోసం లక్షలకు లక్షలు ఖర్చు పెడతారు. మరి మీరు కూడా రూ. 10 లక్షలకు మించిన ధరతో కారు కొనుగోలు చేస్తున్నారా.. ఈ తరహ కార్ల కొనుగోళ్లపై 1 శాతం టీసీఎస్(TCS – Tax Collected at Source) రీఫండ్ వస్తుంది. దీని గురించి చాలామంది తెలియదు. మరి అదేంటో ఇప్పుడు చూసేద్దాం. రూ. 10 లక్షలకు పైగా ధర ఉన్న ఏదైనా మోటారు వెహికిల్ కొనుగోలు చేసినప్పుడు.. ఆ కొనుగోళ్లపై 1 శాతం టీసీఎస్ వర్తిస్తుంది. ఉదాహరణకు, మీరు రూ. 10 లక్షల కారు కొంటే, రూ.10,000 టీసీఎస్ రీఫండ్ వస్తుంది. అదే రూ. 30 లక్షల కారు అయితే, రూ.30,000 వస్తుంది.

ఈ TCS ఎలా పొందాలంటే..

1. ఫారం 27D – కారు కొనుగోలు చేసే సమయంలో డీలర్ నుంచి ఫారం 27D తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఫారం మీరు చెల్లించిన టీసీఎస్ వివరాలకు ప్రూఫ్‌గా ఉంటుంది.

2. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో – ఆదాయపు పన్ను రిటర్న్స్(ITR) ఫైల్ చేసేటప్పుడు, మీరు చెల్లించిన టీసీఎస్ వివరాలను ధృవీకరించాలి. దీని కోసం ఆదాయపు పన్ను శాఖ సైట్‌లో అందుబాటులో ఉండే ఫారం-26ASను సెర్చ్ చేయాలి. ఈ ఫారంలో మీరు చెల్లించిన పన్నులు, టీడీఎస్(TDS), టీసీఎస్ వివరాలను పొందుపరచాలి.

3. రీఫండ్ క్లెయిమ్ – ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు, మీరు ఫారం 26ASలో నమోదు చేసిన టీసీఎస్ మొత్తాన్ని రీఫండ్ కోసం క్లెయిమ్ చేయవచ్చు. మీరు చెల్లించాల్సిన మొత్తం పన్నుల కంటే మీరు చెల్లించిన టీసీఎస్ ఎక్కువ ఉన్నట్లయితే, ఆ అదనపు సొమ్మును ప్రభుత్వం మీ బ్యాంకు ఖాతాకు రీఫండ్ చేస్తుంది. ఒకవేళ మీ పన్ను టీసీఎస్ కంటే ఎక్కువగా ఉంటే, ఆ టీసీఎస్ మొత్తం మీ పన్ను నుంచి సర్దుబాటు అవ్వడం జరుగుతుంది.

ఈ టీసీఎస్ గురించి చాలామందికి తెలియదు. రూ. 10 లక్షలు పైగా ఖర్చు పెట్టి కారు కొంటున్నట్లయితే.. కచ్చితంగా ఈ విధానాన్ని తెలుసుకోవాలి. ఫారం 27D, టీసీఎస్ సర్టిఫికేట్‌ను జాగ్రత్తగా దాచుకుని.. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో తప్పకుండా క్లెయిమ్ చేసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2026లో రాగి బంగారం అవుతుంది! పెట్టుబడి పెడితే..
2026లో రాగి బంగారం అవుతుంది! పెట్టుబడి పెడితే..
ఒకే రాయి పైకప్పుగా వేల ఇళ్లు.. ప్రకృతి వేసిన అద్భుత డిజైన్..!
ఒకే రాయి పైకప్పుగా వేల ఇళ్లు.. ప్రకృతి వేసిన అద్భుత డిజైన్..!
రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే దూసుకొచ్చిన ట్రైన్
రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే దూసుకొచ్చిన ట్రైన్
రూ. 30 వేల జీతంతో 10 ఏళ్లలో రూ. కోటి సంపాదన.. ఎలాగంటే..
రూ. 30 వేల జీతంతో 10 ఏళ్లలో రూ. కోటి సంపాదన.. ఎలాగంటే..
బ్యాట్ పడితే పరుగులు..గిటార్ పడితే పాటలు..అదరగొట్టిన జెమీమా
బ్యాట్ పడితే పరుగులు..గిటార్ పడితే పాటలు..అదరగొట్టిన జెమీమా
సంక్రాంతికి వా వాతియార్.. రిలీజ్ ఎప్పుడంటే..
సంక్రాంతికి వా వాతియార్.. రిలీజ్ ఎప్పుడంటే..
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే