Tech Tips: పాత ఫోన్ అమ్ముతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు డేంజర్‌లో పడ్డట్లే.. అందరూ చేస్తున్న తప్పు ఇదే..
చాలామందికి పాత ఫోన్లను అమ్మేసి కొత్త ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఫోన్‌ను అమ్ముతూ ఉంటారు. ఫోన్‌లోని వ్యక్తిగత వివరాలను డిలీట్ చేయరు. ఇలాంటి సమయంలో మీరు డేంజర్ జోన్‌లో పడతారు.

కొంతమంది పాత ఫోన్‌ను ఎక్సేంజ్‌లో ఇచ్చి లేదా పాత ఫోన్‌ను అమ్మేసి కొత్త ఫోన్‌ను కొనుగోలు చేస్తూ ఉంటారు. లేక ఫోన్ పాతదై సరిగ్గా పనిచేయకపోతే దానిని మొబైల్ షాపులవారికి అమ్మేస్తూ ఉంటారు. ఇక కొంతమంది ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చే లేటెస్ట్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో పాత ఫోన్‌ను విక్రయిస్తూ ఉంటారు. మొబైల్ షాపులోనో లేదా ఆన్‌లైన్‌లోనూ అమ్ముతూ ఉంటారు. ఇలా ఫోన్ అమ్మేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టం జరగొచ్చు.
రీసెట్ ఒక్కటే సరిపోదు
ఎవరైనా ఫోన్ అమ్మేటప్పుడు ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారు. ఇది ఒక్కటి చేస్తే ఫోన్‌లోని డేటా మొత్తం పోతుందని, ఎలాంటి ఇబ్బంది ఉందని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కటి చేస్తే సరిపోదు. రీసెట్ చేశాక కూడా మీ ఫోన్‌లోని సమాచారాన్ని ఇతరులు తిరిగి పొందే అవకాశముంది. దీని కోసం చాలా టూల్స్ అందుబాటులోకి ఉన్నాయి. దీని నుంచి బయటపడేందుకు మీరు ఫోన్‌ను రెండుసార్లు ఫ్యాక్టరీ రీసెచ్ చేయండి. ఇక ఫోన్ ఫింగర్ ప్రింట్, ఫేస్ రికగ్నినైజేషన్, బయోమెట్రిక్ వంటి వివరాలు తొలగించండి.
మెయిల్స్ అకౌంట్లు లాగౌట్
మీరు వివిధ మెయిల్స్ ద్వారా మల్టీఫుల్ అకౌంట్లలో లాగిన్ అవుతారు. మీరు ఫోన్‌ను రీసెట్ చేసేముందు మీ మెయిల్ అకౌంట్లన్నీ లాగౌట్ చేయండి. దీని వల్ల ఫోన్ రీసెట్ చేసిన తర్వాత మీ అకౌంట్లు అన్నీ డిలీట్ అవుతాయి. ఇక కొంతమంది క్లౌడ్ బ్యాకప్ పెట్టుకుని ఉంటారు. మీరు ఫోన్‌ను రీసెట్ చేసేముందు ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాతనే ఫోన్‌ను రీసెట్ చేసుకోండి.
యాప్స్ లాగౌట్ చేయండి
ఇక ఫోన్‌లో మనం అవసరాల కోసం చాలా రకాల యాప్స్ వాడుతూ ఉంటాం. బ్యాంకింగ్ యాప్‌లు మనం అనేకం వాడుతూ ఉంటాం. అందుకే ఫోన్ రీసెట్ చేసేముందు ఈ యాప్స్ నుంచి లాగౌట్ అవ్వండి. దీని వల్ల మీరు ఎవరికైనా అమ్మేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక చాలామంది ఫోన్‌ను విక్రయించే సమయంలో ఈ సిమ్ రిమూవ్ చేయడం మర్చిపోతారు. మీరు ఫోన్‌ను రీసెట్ చేసేముందు ఈ సిమ్‌ను వేరే ఫోన్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి.




