- Telugu News Photo Gallery Spiritual photos New Year 2026 Astrology: Own Home ad Vehicle Yoga for 6 Zodiac Signs Telugu Astrology
Astrology 2026: కొత్త సంవత్సరంలో వారికి గృహ, వాహన యోగాలు గ్యారంటీ..!
Own House and Vehicle Yoga: కొత్త సంవత్సరంలో గ్రహాల అనుకూలత వల్ల కొన్ని రాశుల వారికి సొంత ఇల్లు, సొంత వాహనం అమరే అవకాశం కనిపిస్తోంది. గృహ, వాహన కారకుడైన గురువు మరో అయిదు నెలల్లో ఏడాది పాటు కర్కాటక రాశిలో ఉచ్ఛస్థితిపట్టడం కారణంగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారు గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఈ దిశగా ప్రయత్నాలు సాగించి విజయం పొందడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. సాధారణంగా జాతకంలో నాలుగవ స్థానాన్ని, గురువు స్థితిగతులను బట్టి గృహ, వాహన యోగాలను నిర్ధారించడం జరుగుతుంది.
Updated on: Dec 18, 2025 | 7:14 PM

మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో గురువు మే ఆఖరులో ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారు జూన్, జూలై నెలల్లో గృహ ప్రవేశం చేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి నుంచే వీరు సొంత ఇంటి కోసం ప్రయత్నాలు సాగించడం మంచిది. రుణ సౌకర్యాలు, ఆర్థిక సహాయాలు లభించడానికి అవకాశం ఉంది. వీరికి త్వరలో సొంత వాహనం కలిగే అవకాశం కూడా ఉంది. సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరు ఫ్లాట్ కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మిథునం: ఈ రాశివారికి ధన స్థానంలో గురువు ఉచ్ఛపట్టబోతున్నందువల్ల ఈ రాశివారికి ఫిబ్రవరి నెలలో గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మే తర్వాత గృహ ప్రవేశం చేయడం జరుగుతుంది. గృహ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయాలు సకాలంలో సజావుగా అందుతాయి. ఈ నెల 21 తర్వాత సమయం అనుకూలంగా ఉన్నందువల్ల ఇంటికి అవసరమైన డబ్బు, వస్తు సామగ్రిని సమకూర్చుకోవడం మంచిది.

కర్కాటకం: గృహ, వాహన కారకుడైన గురువు ఈ రాశిలో జూన్ మొదటి వారంలో ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి మే నెల లోపు తప్పకుండా గృహ యోగం పడుతుంది. జూలై నెలలో గృహ ప్రవేశం చేయడానికి కూడా అవకాశం ఉంది. ఉచ్ఛ గురువు కారణంగా సరైన సమయానికి ఆర్థిక పరిస్థితి అనుకూలించడంతో పాటు రుణ సౌకర్యం కలిగే అవకాశం కూడా ఉంది. బహుశా సువిశాలమైన ఫ్లాట్ కొనడం జరుగుతుంది. ఫిబ్రవరి తర్వాత వీరికి తప్పకుండా వాహన యోగం కూడా కలుగుతుంది.

కన్య: ఈ రాశికి లాభ స్థానంలో గురువు ఉచ్ఛ పట్టబోతున్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా మే నెలలో గృహ ప్రవేశం చేయడానికి అవకాశం ఉంది. ఆధునిక సౌకర్యాలు కలిగిన ఇంటిని కొను గోలు చేసే సూచనలున్నాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉన్నందువల్ల సొంత ఇంటి మీద భారీగా పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. సొంత ఇంటితో పాటు విలువైన స్థలాన్ని, వాహనాన్ని కూడా కొనడానికి అవకాశం ఉంది. రుణ సౌకర్యం తేలికగా అందడం కూడా జరుగుతుంది.

వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల గృహ, వాహన సంబంధమైన కోరి కలు తప్పకుండా నెరవేరుతాయి. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి ముందుగా వాహన యోగం కలిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి, మే నెలల మధ్య తప్పకుండా గృహ ప్రవేశం చేయడం జరుగుతుంది. స్థల విక్రయం ద్వారా లభించిన సొమ్మును సొంత ఇంటి మీద పెట్టుబడిగా పెట్టే సూచనలున్నాయి. కొత్త సంవత్సరంలో గృహ, వాహన సంబంధమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.

మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛపట్టడంతో పాటు రాశ్యధిపతి శని కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారి సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది. మేలో గృహ ప్రవేశం చేయడం కూడా జరుగుతుంది. పాత ఇంటిని కొని మరమ్మతులు, పునర్నిర్మాణ కార్యక్రమాల ద్వారా సొంత ఇంటిని పొందడం జరుగుతుంది. గృహ యోగంతో పాటు ఫిబ్రవరి లోపు వాహన యోగం కూడా కలుగుతుంది. స్థలం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.


