- Telugu News Photo Gallery Spiritual photos Jupiter Aspect : 6 Zodiac Signs to Gain Wealth, Career and Marriage Blessings
వక్ర గురువుతో ఆ రాశుల వారికి వరాల వర్షం పక్కా..! ఇందులో మీ రాశి ఉందా?
ప్రస్తుతం మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తున్న గురువుకు ఈ నెల (డిసెంబర్) 21 నుంచి మరింతగా బలం పెరుగుతోంది. ఈ గురువును రవి, కుజ, శుక్రులు సమ సప్తక దృష్టితో వీక్షిస్తున్నందువల్ల గురువు కొన్ని రాశులవారిని వేగంగా, బలంగా అనుగ్రహించే అవకాశం ఉంది. దీనివల్ల పెళ్లి, ప్రేమలు, గృహ ప్రవేశం, వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, చదువుల వంటి విషయాల్లో ఒకటి రెండు నెలల్లో శుభయోగాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు దీనివల్ల లబ్ధి పొందడం జరుగుతుంది.
Updated on: Dec 17, 2025 | 8:09 PM

వృషభం: ఈ రాశివారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా సఫలం అవుతుంది. అదనపు ఆదాయ మార్గాలు, అవకాశాలు లభిస్తాయి. జీతభత్యాలు ఎక్కువగా ఇచ్చే ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించిన లాభాలనిస్తాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.

మిథునం: ఈ రాశివారికి కెరీర్ పరంగా జీవితం ఒక మంచి మలుపు తిరుగుతుంది. అనుకోకుండా అధికారం చేపట్టడం గానీ అధికారం చేపట్టడానికి అవకాశం ఉన్న ఉద్యోగంలోకి మారడం గానీ జరుగుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ది చెందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ తేలికగా పూర్తవుతాయి. ప్రతి ప్రయత్నమూ కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సింహం: ఈ రాశివారికి లాభ స్థానంలో గురువుకు బలం పెరగడం ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన ఆఫర్లు అందుతాయి. విదేశీ యానానికి సంబంధించిన సమస్యలు, ఆటంకాలు తొలగిపోతాయి. తండ్రి వైపు నుంచి అనుకూలతలు ఏర్పడతాయి. తండ్రి నుంచి ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఆకస్మిక దూర ప్రయాణాలు ఉండవచ్చు. వృత్తి, ఉద్యోగాల పరంగా శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

తుల: ఈ రాశివారికి భాగ్య స్థానంలో గురువుకు బలం పెరగడం వల్ల అనేక విధాలుగా అదృష్టం తలుపు తడుతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు, ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. జీవనశైలి మారి పోతుంది. విలాసవంతమైన జీవితం అలవడుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. సంపన్న కుటుంబంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది.

ధనుస్సు: ఈ రాశినాథుడైన గురువు సప్తమ స్థానంలో వక్రించి, బలపడడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఊహించని మార్గాల్లో సంపద వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. ఆధునిక జీవనశైలి అలవడుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. గృహ, వాహన సంబంధమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. వ్యాపారాల్లో డిమాండ్, రాబడి అంచనాల్ని మించుతాయి.

కుంభం: ఈ రాశివారికి పంచమ స్థానంలో ఉన్న గురువుకు బలం పెరగడం వల్ల అనుకోకుండా ఆస్తి లేదా సంపద కలిసి వస్తుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ది చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. పెండింగులో ఉన్న శుభ కార్యాలు పూర్తవుతాయి. పెళ్లి సంబంధాలు కలిసి వస్తాయి.



