దూకుడు పెంచిన టీవీకే పార్టీ అధినేత విజయ్.. ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసే పనిలో బిజీ..!
టీవీకే పార్టీ అధినేత విజయ్ దూకుడు పెంచారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. డీఎంకే పార్టీకి తానే ప్రత్యామ్నాయం అని నిరూపించుకునే పనిలో బిజీ అయ్యారు. ఇందులో భాగంగా ఈరోడ్ జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు విజయ్.

టీవీకే పార్టీ అధినేత విజయ్ దూకుడు పెంచారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. డీఎంకే పార్టీకి తానే ప్రత్యామ్నాయం అని నిరూపించుకునే పనిలో బిజీ అయ్యారు. ఇందులో భాగంగా ఈరోడ్ జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు విజయ్.
వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టారు TVK అధినేత విజయ్. ఆయన కింగ్ అవుతారా.. లేక, కింగ్ మేకర్ గా మారతారా అనేది కాలమే నిర్ణయిస్తుంది కానీ.. ప్రస్తుతానికైతే తన సభలు, ప్రచార కార్యక్రమాలతో డీఎంకేపై ప్రత్యక్ష పోరాటానికి సంకేతాలు ఇచ్చారు విజయ్. ఈరోడ్ జిల్లా వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో అధికార డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు TVK అధినేత విజయ్. డీఎంకేను ఒక “దుష్ట శక్తి”గా అభివర్ణించిన విజయ్, తన తమిళగ వెట్రి కళగం పార్టీని పవిత్ర శక్తిగా ప్రజల ముందు నిలబెట్టారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు తథ్యమని.. నిజమైన పోటీ పవిత్ర శక్తి – దుష్టశక్తి మధ్యనే ఉంటుందన్నారు విజయ్.
కరూర్ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత విజయ్ పాల్గొన్న తొలి సభ కావడంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత పెరిగింది. తనపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ప్రజల మద్దతుతో ఆ ప్రయత్నాలు విఫలమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. నీట్ మినహాయింపు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ, డీఎంకే నిరంతర తప్పుడు ప్రచారాలను నిర్వహిస్తోందని ఆరోపణలు చేశారు. టీవీకే బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా శక్తిగా ఎదగనివ్వకూడదనే లక్ష్యంగా అధికార పార్టీ పని చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురవుతోందని మండిపడ్డారు. డీఎంకే- సమస్యలు ఫెవికాల్‌లా అతుక్కుపోయాయని విమర్శించారు. టీవీకే అధికారంలోకి వస్తే ప్రజల మద్దతుతో అవినీతి రహిత పాలనను అందిస్తామన్నారు విజయ్.
సంక్షేమ పథకాలపై తన వైఖరిని స్పష్టం చేస్తూ, సబ్సిడీలకు తాను వ్యతిరేకం కాదని, కానీ డీఎంకే పార్టీ ఉచిత పథకాల పేరుతో ప్రజలను అవమానిస్తుందని ఆరోపించారు. కనీస వసతులు ఏర్పాటు చేయకుండా ఎందుకు ఉచిత పథకాలుగా మారుస్తున్నారని ప్రశ్నించారు విజయ్. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈరోడ్‌లో ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా విజయ్ పర్యటనను నిర్వహించారు. మొత్తంగా ఎన్నికల సమీపిస్తున్న వేళ క్యాడర్‌లో జోష్ నింపుతూ… ప్రజల్లోకి వెళేందుకు మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు విజయ్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




