జీడిపప్పు తింటే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..?

18 December 2025

Pic credit - Instagram

Phani Ch

జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలుసు. ఇందులో పుష్కలంగా ఉండే పోషకాలు శరీరానికి శక్తిని అందించడంలో, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కీలకంగా పనిచేస్తాయి. 

జీడిపప్పులో ముఖ్యంగా కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు పెరగాలనుకునే వారు సాధారణంగా ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. 

100 గ్రాముల జీడిపప్పులో: 553 కేలరీలు, 18g ప్రోటీన్, 44g ఆరోగ్యకరమైన కొవ్వు, 3g ఫైబర్, మెగ్నీషియం, ఐరన్ వంటి మినరల్స్.

అలాంటి వారికోసం జీడిపప్పు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా వేయించిన జీడిపప్పులో కొంచెం ఉప్పు కలిపి తింటే రుచిగా ఉంటుంది. 

అందులోని కేలరీలు శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే విధంగా పని చేస్తాయి. ఈ విధంగా తినడం వల్ల బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. 

బరువు తగ్గాలనుకునే వారు కూడా జీడిపప్పును మితంగా తీసుకుంటే ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు తమ రోజువారీ ఆహారంలో జీడిపప్పును చేర్చుకోవచ్చు.

బ్యాలెన్స్‌డ్ డైట్ + వ్యాయామంతో కలిపి తింటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోండి