ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం దృష్ట్యా 50 శాతం మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధించారు. పొల్యూషన్తో దగ్గు, జలుబు, శ్వాస సమస్యలు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల భద్రత కోసం రోడ్లపై రద్దీ తగ్గించాలని ప్రభుత్వం ఈ కఠిన నిబంధనను అమలు చేస్తోంది, ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.