చెరుకు రసంలో అనేక పోషకాలు ఉన్నప్పటికీ, చక్కెర స్థాయి ఎక్కువ. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి ఇది హానికరం. చెరుకులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి.
ఒక గ్లాస్‌లో: 180-250 కేలరీలు, 40-50g చక్కెర, పొటాషియం, ఐరన్, కాల్షియం వంటి మినరల్స్. హైడ్రేషన్‌కు, ఎనర్జీకి మంచిది కానీ చక్కెర ఎక్కువ.
చెరుకు రసం వంటి పానీయాలు తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి వేగంగా పెరుగుతుంది. డయాబెటిస్ ఉన్నవారు చెరుకు రసం తాగకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
చెరకులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.. దీంతో పాటు కార్బొహైడ్రేట్స్, ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి.
అయితే వీటితో ఎలాంటి సమస్య లేకపోయినా ఇందులో ఉండే నేచురల్ షుగర్ మాత్రం డయాబిటెక్ పేషెంట్లు మాత్రం చెరుకు రసం తాగాలంటే భయపడుతుంటారు.
కానీ, డయాబెటిస్ ఉన్న వాళ్లు చెరకు రసం తాగే విషయంలో జాగ్రత్తగా ఉంటే తగిన మోతాదులో తీసుకోవచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు.