ఉదయాన్నే ఈ టీ తాగితే.. అందం, ఆరోగ్యం రెట్టింపు!

18 December 2025

Jyothi Gadda

శంఖుపుష్పం టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి.  జీర్ణక్రియలో పేరుకున్న టాక్సిన్స్‌ తొలగుతాయి.

శంఖుపుష్పం టీ జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్‌, కడుపుఉబ్బరం వంటి సమస్యలు నయం అవుతాయి.

శంఖుపువ్వుల టీలో కెఫిన్‌ ఉండదు. కార్బోహైడ్రేట్స్‌, కొవ్వులు, కొలెస్ట్రాల్‌ ఉండవు. ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి మంచిది.

రోజూ శుంఖు పుష్పాల టీ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నివారిస్తుంది. షుగర్‌ పేషెంట్స్‌ ఈ టీ తాగితే మేలు.

శంఖు పుష్పాల టీలో బలవర్ధకమైన బయోఫ్లావనాయిడ్ సమ్మేళనాలు గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. కొలెస్ట్రాల్ వాల్యూమ్‌లను, రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తాయి.

రోజూ ఈ టీ తాగితే హానికరమైన ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్‌ సాంద్రతలు తగ్గుతాయి. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతుంది.

ఈ టీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జేసిక్ లక్షణాలు కంటి ఇన్ఫెక్షన్లు, ఎరుపు, వాపు వంటి సమస్యలను తగ్గిస్తాయి. దృష్టి, కంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.

శంఖు పుష్పాలటీ మెదడు ఆరోగ్యానికి, ఆందోళన, నిరాశకు చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో వాడుతుంటారు. అల్జీమర్స్‌తో పోరాడుతుంది.

ఈ టీ తాగితే మెదడు రిఫ్రెష్ ‌ అవుతుంది, సానుకూల భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. తద్వారా పనిలో ఉత్పాదకతను పెంతుంది.