- Telugu News Photo Gallery Business photos To receive the 22nd installment of PM Kisan funds farmers must complete eKYC and link their Aadhaar card
PM Kisan: ఈ రెండు పనులు చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు కట్.. రైతులకు కేంద్రం బిగ్ అలర్ట్.. వెంటనే చేస్కోండి. .
పీఎం కిసాన్ 22వ విడత నగదు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లలో జమ చేసే అవకాశముంది. ఈ మేరకు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎలాంటి అవాంతరాలు లేకుండా పీఎం కిసాన్ నగదు అందుకోవాలంటే రైతులు రెండు పనులు తప్పనిసరిగా చేయాల్సిందే. అవేంటో ఇందులో చూద్దాం.
Updated on: Dec 18, 2025 | 5:23 PM

కేంద్ర ప్రభుత్వం దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు ఆర్ధికంగా సహాయం అందించేందుకు పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నవంబర్‌లో 21వ విడత క్రింద రూ.2 వేలు రైతుల అకౌంట్లలో నేరుగా జమ చేసింది. అయితే 22వ విడత నిధులు ఎప్పుడు వస్తాయనేది రైతులు ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 22వ విడత నిధులు అందుతాయని వార్తలు వస్తున్నాయి.

అయితే 22వ విడత డబ్బులు లబ్దిదారులు అందుకోవాలంటే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఎటువంటి అంతరాయం లేకుండా నిధులు పొందాలంటే ఈకేవైసీ పూర్తి చేయాలి. ఈకేవైసీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ మీ ఈకేవైసీ పెండింగ్‌లో ఉంటే వెంటనే చేసుకోవడం వల్ల రాబోయే 22వ విడత డబ్బులు మీకు నిలిపివేసే అవకాశం ఉండదు.

పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in వెబ్‌సైట్లోకి వెళ్లి ఓటీపీని ఉపయోగించి ఈకేవైసీ సులువుగా పూర్తి చేయొచ్చు. అలాగే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా పీఎం కిసాన్ యాప్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఇది పూర్తి చేయడం వల్ల మీకు నిధులు ఆగవు.

ఇక రైతులు తమ బ్యాంకు అకౌంట్లను ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సి ఉంటుంది. దీనిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో డీబీటీ ఇనాక్టివ్ లేదా బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ అయి ఉండకపోడం వల్ల పీఎం కిసాన్ డబ్బులు అందుకోలేరు.

మీరు బ్యాంక్‌కు వెళ్లి బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ చేసుకోవచ్చు. లేదా బ్యాంకింగ్ మొబైల్, ఇంటర్నెట్ ఫ్లాట్ఫామ్స్ ద్వారా ఆన్‌లైన్‌లో లింక్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మీకు డీబీటీ యాక్టివ్ అవుతుంది.



