AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore District: కాలువలో గోనెసంచిలో తేలిన శవం.. దర్యాప్తులో తేలిన సంచలన నిజం.. కి’లేడి’

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పంటపాలెం శివారులో కలకలం.. కాలువలో ఓ శవం.. దర్యాప్తులో తేలిన సంచలన నిజం..

Nellore District: కాలువలో గోనెసంచిలో తేలిన శవం.. దర్యాప్తులో తేలిన సంచలన నిజం.. కి'లేడి'
Wife Eliminates Husband
Ram Naramaneni
|

Updated on: Nov 21, 2022 | 8:29 PM

Share

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పంటపాలెం శివారు కాలువలో ఓ శవం కనిపించడంతో కలకలం చెలరేగింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. ఇన్వెస్టిగేషన్‌ చేయడంతో క్రైమ్ వెనుక ఉన్న కహాని గుట్టు వీడింది. ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుని.. ప్రియుడి సాయంతో భర్తనే ఖతం చేయించింది ఈ ఇల్లాలు. వివరాల్లోకి వెళ్తే.. పంటపాలెంకు చెందిన శోభ ,మణి భార్యభర్తలు. వీళ్లిద్దరి లవ్‌ మ్యారేజ్‌. మొదట్లో బాగానే ఉండేవాళ్లు. వీళ్లకు నలుగురు పిల్లలు. మణి.. రొయ్యల చెరువు దగ్గర కాపాలదారు. అతని మద్యం అలవాటు వుంది. అడపాదడపా దోస్తులతో కలిసి మందు పార్టీ చేసుకునేవాడు. ఇంటి పనులతో పాటు భర్తకు చేదోడుగా చిన్నా చితక పనులు చేసేది శోభ.

సాఫీగా సాగిపోతున్న వీళ్ల కాపురంలో భరత్‌ అనే వ్యక్తి ఎంట్రీతో చిచ్చురేగింది. పరిచయం- స్నేహం.. చివరాఖరకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. మణి..మద్యం మత్తులో ఉంటే ..వీళ్లిద్దరి జల్సా వీళ్లదే. మ్యాటర్‌ భర్తకు తెలిసి ఆలు మగల మధ్య గొడవలయ్యాయి. పద్దతి మార్చుకోమని హెచ్చరించాడు. కానీ ఆమె వైఖరి మారలేదు. భరత్‌తో వివాహేతర సంబంధం కొనసాగాలంటే భర్తను కడతేర్చాలని డిసైడయింది శోభ. ఇద్దరు కలిసి స్కెచ్చేశారు. ప్లాన్‌ ప్రకారం మణిని హత్య చేశారు. చేసిందంతా చేసి కన్నీళ్లు కార్చింది శోభ. కానీ కాలువలో శవం తేలింది. దర్యాప్తులో నిజం తెరపైకి వచ్చింది.

మణిని హత్య చేసి డెడ్‌బాడీని గోనెసంచిలో కుక్కి కాల్వలో పడేశారు నిందితులు. కాలువలో శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శోభ-భరత్‌ అండ్‌ కో బండారం బయటపడింది. నిందితులను అరెస్ట్‌ చేసి కటకటాల బాటపట్టించారు పోలీసులు. తండ్రి చనిపోయాడు.. తల్లి జైలు పాలు అవ్వడంతో.. ఆ నలుగురు పిల్లలు అనాథలయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..