AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారస్తులు లాభాలు పొందే అవకాశం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

ఈరోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 22వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారస్తులు లాభాలు పొందే అవకాశం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Surya Kala
|

Updated on: Nov 22, 2022 | 6:23 AM

Share

Horoscope Today (22-11-2022): ప్రతి వ్యక్తి తన జీవితంలో జరిగే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని.. అందుకు అనుగుణంగా తాము నడుచుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందుకనే  ఈరోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 22వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ  రోజు ఈ రాశివారు అందరి ప్రశంసలను అందుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు శుభఫలితాలను పొందుతారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశి వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారికీ అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. పనితీరుతో ప్రశంసలను అందుకుంటారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు ఆటంకాలు కలుగ కుండా అందరినీ కలుపుకుని వెళ్లాల్సి ఉంటుంది.  ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. మానసికంగా దైర్యంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు  అనుకూల ఫలితాలను పొందుతారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు బద్ధకాన్ని వదిలి స్థిర నిర్ణయాలతో అభివృద్ధి బాటలో పయణించాల్సి  ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులను సులభంగా పూర్తి చేస్తారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుని అందరి ప్రశంసలను అందుకుంటారు. ముఖ్య విషయాల్లో ఇబ్బందిపెట్టేవారు ఉన్నారు. చంచల బుద్ధితో ఇబ్బంది పడతారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు అనవసర భయాందోళనలను తగ్గించుకోవడం మేలు. ఉత్సాహంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. ముఖ్య విషయాల్లో పెద్దల సహకారం తీసుకోవడం ఉత్తమం. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మేలు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు శ్రమకు తగిన గుర్తింపు అందుకుంటారు. వ్యాపారంలో లాభాలను పొందుతారు. శుభవార్త వింటారు. బంధు, మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి వారు కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకునే విధంగా చూసుకోవాలి. పట్టుదలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వృధా ఖర్చులు మాని పొదుపు పాటించాలి. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కీలక చర్చలు ఫలించి శుభవార్త వింటారు.  నూతన వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ప్రశాంతంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.  ఒక సంఘటన బాధ కలిగిస్తుంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు విరోధాలు , వివాదాలకు దూరంగా ఉండడం మేలు. ఆత్మవిశ్వాసంతో  చేపట్టిన పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. శ్రమ ఫలిస్తుంది. మానసికంగా ఇబ్బంది ఎదుర్కొంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్