Vastu Tips For New Couple: దంపతులు గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలంటే నవ వధువు బెడ్ రూమ్ లో ఈ వాస్తు టిప్స్ పాటించి చూడండి..
దంపతులు తరచుగా గొడవలు పడడానికి వివిధ కారణాలు ఉన్నప్పటికీ.. ఇంటి వాస్తు కూడా భార్యాభర్తల బంధాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? మీరు మీ భాగస్వామితో సఖ్యత లేకుంటే.. వైవాహిక జీవితం కోసం వాస్తు నిపుణులు సూచించిన విధంగా కొన్ని వాస్తు చిట్కాలు పాటించి చూడండి..
దంపతుల మధ్య ఎటువంటి స్పష్టమైన కారణాలు లేకుండా తరచుగా విబేధాలు ఏర్పడి.. గొడవలు పడుతున్నారా.. ఎంత ప్రయత్నించినా మీ భాగస్వామ్యంతో తరచుగా వివాదాలు ఏర్పడుతుంటే ఏ భార్యాభర్తలైనా బాధపడడం సహజం. అయితే ఎవరైనా సంతోషకరమైన వైవాహిక జీవితం కావాలని కోరుకుంటారు. అయితే భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు జరుగుతూ ఉంటే అది ఎప్పటికీ సాధ్యం కాదని దంపతులు భావిస్తారు. ఇలా తరచుగా గొడవలు పడడానికి వివిధ కారణాలు ఉన్నప్పటికీ.. ఇంటి వాస్తు కూడా భార్యాభర్తల బంధాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? మీ భాగస్వామితో సంతోషకరమైన సంబంధం, అవగాహన, అనుకూలత, బంధాన్ని కలిగి ఉండటానికి మీ పడకగది, వంటగది సహా మొత్తం ఇంటిలో శక్తి సమతుల్యతను కలిగి ఉండటం చాలా ముఖ్యం అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
మీరు మీ భాగస్వామితో సఖ్యత లేకుంటే.. వైవాహిక జీవితం కోసం వాస్తు నిపుణులు సూచించిన విధంగా కొన్ని వాస్తు చిట్కాలు పాటించి చూడండి..
- 1) వాస్తు ప్రకారం.. దంపతుల పడకగది ఆగ్నేయ దిశలో ఉండకూడదు. ఆగ్నేయం అగ్నిదేవుడి నివాసం. ఇది శాంతికి ఆటంకం కలిగిస్తుంది. అంతేకాదు దూకుడు ప్రవర్తనకు దారి తీస్తుంది. అంతేకాదు ఆగ్నేయ దిశలో భాగస్వామితో సంభాషణ చేయవద్దు. ఇలా చేయడం వల్ల మీ భాగస్వామితో తగాదాలు, అనవసర వాదనలు పెరుగుతాయి.
- 2) వాస్తు ప్రకారం.. మీ పడకగదిని చక్కగా, శుభ్రంగా ఉండేలా చూసుకోండి. మీ పడకగదిలో, చెత్త లేదా విరిగిన వస్తువులను ఉంచకూడదు. సుఖ సంతోషకరమైన సంబంధం కోసం మీ పడకగదిని పువ్వులు, కొవ్వొత్తులు, సువాసనలతో అలంకరించండి.
- 3) వాస్తు ప్రకారం.. మీ భాగస్వామితో శృంగార సంభాషణకు ఉత్తమ దిశ.. ఉత్తర-వాయువ్య దిశ.
- 4) కొత్తగా పెళ్లయిన జంట పడకగది ఉత్తర-వాయువ్య దిశలో ఉండాలి. ఇంటిలో పెద్దవారి పడకగది దక్షిణ దిశలో ఉండాలి.
- 5) వాస్తు ప్రకారం.. ఒకే వరుసలో డిష్-వాషింగ్ సింక్, గ్యాస్ స్టవ్ ఉండకూడదు. నీరు, అగ్ని ఎల్లప్పుడూ వేరు వేరుగా ఉండాలి.
- అయితే.. ఒక సంబంధం నమ్మకం, గౌరవం, అవగాహనపై నిలబడుతుంది. అయితే ఈ వాస్తు చిట్కాల ప్రభావం కూడా వైవాహిక జీవితంలో ప్రేమను పెంచడంలో, మీ బంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)