AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Man Fined: తాగి వాహనం నడిపాడని రూ.5.5 లక్షల ఫైన్.. గంటల వ్యవధిలోనే అరెస్ట్‌..

కారు నంబర్ ప్లేట్‌ను గుర్తించిన పోలీసులు గంటల వ్యవధిలోనే అతడిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వ్యక్తి మద్యం మత్తులో కారు నడుపుతున్నట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు.

Indian Man Fined: తాగి వాహనం నడిపాడని రూ.5.5 లక్షల ఫైన్.. గంటల వ్యవధిలోనే అరెస్ట్‌..
Crashing Vehicle In Dubai
Jyothi Gadda
|

Updated on: Nov 22, 2022 | 8:09 PM

Share

దుబాయ్‌లో భారతీయుడికి భారీ జరిమానా విధించారు. దుబాయ్‌లో కారును ఢీకొట్టిన 39 ఏళ్ల భారతీయ వ్యక్తికి 25,000 దిర్హామ్‌లు (రూ. 5,56,672) జరిమానా విధించారు. ఆ వ్యక్తి దుబాయ్‌లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు అదుపు తప్పి రోడ్డుకు కుడివైపున ఆగి ఉన్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఆగస్టు 18న బుర్‌ దుబాయ్‌లోని సమీప ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత్‌కు చెందిన 39 ఏళ్ల వ్యక్తి మద్యం సేవించి వాహనం నడిపాడు. ఈ క్రమంలో అదుపు తప్పి రోడ్డు పక్కన పార్క్ చేసిన ఓ కారును ఢీ కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

అయితే అక్కడి పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. కారు నంబర్ ప్లేట్‌ను గుర్తించిన పోలీసులు గంటల వ్యవధిలోనే అతడిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వ్యక్తి మద్యం మత్తులో కారు నడుపుతున్నట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. బెయిల్‌పై విడుదల కావడానికి ముందు రెండు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్నాడు.

ఈ కేసులో 25,000 దిర్హామ్‌లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించిన న్యాయమూర్తి, దానిని పాటించకుంటే ఎనిమిది నెలల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందన్నారు. దుబాయ్ ట్రాఫిక్ కోర్టుకు హాజరుకాకపోవడంతో జరిమానా విధించారు. ఒక్క యూఏఈలోనే దాదాపు 14 శాతం రోడ్డు ప్రమాదాలు తాగి వాహనాలు నడిపేవారి వల్లే జరుగుతున్నాయని స్థానిక మీడియా పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో