Jr.NTR: బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.. ఏ మూవీ అంటే..
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే దేవర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న తారక్.. ఇప్పుడు వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన తారక్.. ట్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో అద్భుతమైన నటనతో హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఇటీవలే దేవర సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. అయితే తారక్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ సింహాద్రి. ఎన్టీఆర్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలో ఇది ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ సంచలన విజయంగా నిలిచింది. అంతకుముందు వీరిద్దరి కాంబోలో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా వచ్చింది.
సింహాద్రి సినిమాలో తనదనైన నటనతో ఆకట్టుకున్నాడు తారక్. ఇందులో ఎన్టీఆర్ సరసన భూమిక, అంకిత హీరోయిన్స్ గా నటించారు. ఇదిలా ఉంటే.. సింహాద్రి సినిమాను నిజానికి నందమూరి బాలకృష్ణ చేయాల్సిందంట. రాజమౌళి సినిమాలకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథలను అందిస్తారన్న విషయం తెలిసిందే. అయితే సింహాద్రి సినిమా కథను బాలకృష్ణ కోసం రాశారట. ఈ చిత్రానికి బీ. గోపాల్ దర్శకత్వం వహించాల్సింది. కానీ అప్పటికే ఆయన మరో సినిమాతో బిజీగా ఉండడంతో ఈ కథను రాజమౌళి ఎన్టీఆర్ కు వినిపించమని చెప్పారట.
సింహాద్రి సినిమా సమయానికి ఎన్టీఆర్ వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే. అప్పట్లో ఈ మాస్ యాక్షన్ సినిమాను ఎన్టీఆర్ హ్యాండిల్ చేయగలడా అనే సందేహం కూడా వచ్చిందట. కానీ అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చేసిన అనుభవంతో తారక్ చేయగలడని చెప్పడంతో ఈ కథను తారక్ కు వినిపించారట. అలా ఈ సినిమా ఎన్టీఆర్ తో స్టార్ట్ అయ్యింది. ఇక అప్పుడు ఈ సినిమాలో కథానాయికగా ఆర్తి అగర్వాల్ అనుకున్నారట. కానీ ఆమె వసంతం సినిమాతో బిజీగా ఉండడంతో భూమికను ఎంపిక చేసుకున్నారు.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.