AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biryani: బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 ఆర్డర్లతో టాప్ ప్లేస్.. రెండో ప్లేస్‌లో ఇదే..

వరుసగా తొమ్మిదే ఏడాది దేశంలో అత్యధికంగా బిర్యానీ ఆర్డర్లు అందినట్లు జొమాటో తన ఇయర్ ఎండ్ నివేదికలో వెల్లడించింది. జొమాటా ఏకంగా 9.13 లక్షల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసింది. అంటే.. సగటున ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లను ఆ సంస్థ డెలివరీ చేసింది. బిర్యానీ తర్వాత అత్యధిక ఆర్డర్లు పిజ్జా కోసం వచ్చాయి.

Biryani: బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 ఆర్డర్లతో టాప్ ప్లేస్.. రెండో ప్లేస్‌లో ఇదే..
Chicken Biryani
Janardhan Veluru
|

Updated on: Dec 27, 2024 | 11:17 PM

Share

దావత్ అంటే బిర్యానీ అని మరోసారి తేలిపోయింది. 2024లో దేశ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగింది. ఈ ఏడాదికి సంబంధించిన జొమాటో ఫుడ్ డెలివరీల్లో బిర్యానీ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ మేరకు జొమాటో 2024 ఇయర్ ఎండ్ రిపోర్ట్‌లో ఆసక్తికర వివరాలను వెల్లడించింది. జొమాటోలో వరుసగా 9వ ఏడాది బిర్యానీయే అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇటీవల స్విగ్గీ రిలీజ్ చేసిన 2024 ఇయర్ ఎండ్ రిపోర్ట్‌లోనూ బిర్యానీయే దేశంలో అగ్రస్థానంలో నిలవగా.. ఇందులోనూ చికెన్ బిర్యానీకే ఎక్కువ ఆర్డర్స్ అందినట్లు వెల్లడించింది. ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో 9,13,99,110 బిర్యానీ ఆర్డర్లు అందినట్లు జొమాటో వెల్లడించింది. సగటున ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు అందినట్లు తెలిపింది.

బిర్యానీ తర్వాత అత్యధిక ఫుడ్ ఆర్డర్లు పిజ్జా కోసం వచ్చినట్లు తన నివేదికలో జొమాటో వెల్లడించింది. దేశంలో మొత్తం 5.84 కోట్ల పిజ్జా ఆర్డర్లు వచ్చింది. అలాగే 77.76 లక్షల టీ ఆర్డర్లు, 74.32 లక్షల కాఫీ ఆర్డర్లను జొమాటో డెలివరీ చేసింది. టీ, కాఫీలో కాస్త ఎక్కువగా టీ కోసమే ఆర్డర్లు అందినట్లు ఈ నివేదిక వెల్లడించింది. జొమాటో నివేదికలో మరిన్ని ఆసక్తికర అంశాలేమెంటే.. ఓ వ్యక్తి 120 మంచూరియాలను ఆర్డర్ చేసి.. రైలు బోకీలోని అందరికీ పంచిపట్టారు.

బెంగుళూరుకు చెందిన ఓ కస్టమర్ ఓ రెస్టారెంట్‌కు వెళ్లి జొమాటో డైనింగ్ కింద రూ.5.13 లక్షల బిల్లు చెల్లించారు. 2024లో సింగిల్ డైనింగ్‌లో అత్యధిక బిల్లు ఇదే కావడం విశేషం. మరో ఆసక్తికర అంశమేమంటే.. ఓ కస్టమర్ ఈ ఏడాది ఏకంగా 1377 వేర్వేరు రెస్టారెంట్లలో ఆర్డర్స్ ఇచ్చి విభిన్న రుచులను ఎంజాయ్ చేశాడు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్