Cabbage in Winter: అందుకే చలికాలంలో క్యాబేజీ తప్పకుండా తినాలట.. ఎన్ని లాభాలో తెలుసా?

సీజనల్ కూరగాయల్లో క్యాబేజీ ఒకటి. ఇవి చలి కాలంలో అధికంగా లభ్యమవుతాయి. పైగా ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. అయితే చాలా మంది దీని రుచి కారణంగా తినేందుకు ఇష్టపడరు. కానీ ఇందులో ఉండే పోషకాలు క్యాన్సర్ నుంచి కొలెస్ట్రాల్ వరకు ఎన్నో వ్యాధులను తరిమి కొడతాయి. అందుకే ఆరోగ్య నిపుణులు ఈ కూరగాయలను కూడా తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలని సూచిస్తున్నారు..

Cabbage in Winter: అందుకే చలికాలంలో క్యాబేజీ తప్పకుండా తినాలట.. ఎన్ని లాభాలో తెలుసా?
Cabbage
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 27, 2024 | 1:40 PM

నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలను తప్పనిసరిగా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. చలికాలంలో వచ్చే సీజనల్‌ కూరగాయల్లో క్యాబేజీ కూడా ఒకటి. కొంత మందికి క్యాబేజీ ఇష్టం ఉండదు. దీని వాసన, రుచి కారణంగా దూరం పెడుతుంటారు. కానీ క్యాబేజీని కూడా అన్ని కూరగాయలతో కలిపి తినాలని చెబుతారు నిపుణులు. క్యాబేజీలో ఉండే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మీరూ ఖచ్చితంగా తింటారు. క్యాబేజీలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. క్యాబేజీ మధుమేహం, థైరాయిడ్ సమస్యలతో కూడా సమర్థవంతంగా పోరాడుతుంది. క్యాబేజీని తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..

క్యాబేజీలో ఎక్కువ మొత్తంలో నీరు, తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది రోజంతా మనకు కావాల్సిన హైడ్రేషన్‌ను అందిస్తుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఇది మంచి ఎంపిక. క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీలో ఫైబర్, విటమిన్ కె, సి కూడా అధికంగా ఉన్నాయి. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కూడా మంచిది.

ప్రాణాంతకమైన గుండె సమస్యలు, క్యాన్సర్ నుండి మనలను రక్షిస్తుంది. క్యాబేజీలో యాంటీహైపర్గ్లైసీమిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది. డయాబెటిక్ నెఫ్రోపతీ నుంచి రక్షిస్తుంది. క్యాబేజీలో గ్లూకోసినోలేట్, సల్ఫర్ ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. క్యాబేజీ అన్ని సీజన్లలో మార్కెట్‌లో సులభంగా దొరుకుతుంది. క్యాబేజీలో ఆంథోసైనిన్లు ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్ధీకరించి బీపీని తగ్గిస్తుంది. పీచు పుష్కలంగా ఉండటం వల్ల క్యాబేజీ చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

కడుపులో అల్సర్‌లను కూడా నివారిస్తుంది. క్యాబేజీని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన శరీర పనితీరు మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను పరిష్కరించుకోవచ్చు. క్యాబేజీ శరీరంలో మంటను కూడా తొలగిస్తుంది. దీనివల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, అల్జీమర్స్ వ్యాధితో బాధపడేవారు ఆరోగ్యంగా ఉంటారు. క్యాబేజీలో పెద్ద మొత్తంలో విటమిన్ కె, అయోడిన్, యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ ఉన్నందున మెదడు కణాల అభివృద్ధికి సహాయపడుతుంది. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి కోల్పోయే అవకాశాన్ని నివారిస్తుంది. అల్జీమర్స్ వ్యాధిని నివారిస్తుంది. క్యాబేజీతో వివిధ రకాల వంటలు చేయవచ్చు. పచ్చి సలాడ్ నుంచి వేడి సూప్ వరకు, రుచికరమైన స్టీమ్డ్ మోమో, స్ప్రింగ్ రోల్, పల్యా, సాంబార్, పలావ్, పరాటా, ఉత్తప్ప వంటి ఎన్నో రుచిగల వంటకాలు తయారు చేసుకోవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!