- Telugu News Photo Gallery Are you eating too much spicy and hot food in winter? know what happence to your body
Hot Food in Winter: వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా? ఈ విషయం తెలుసుకోండి
కాస్త వర్షం కురిసినా, వాతావరణం చల్లగా ఉన్నా శరీరం వెచ్చదనాన్ని కోరుకుంటుంది. అంతే స్నానం మొదలు ఆహారం వరకు అన్నీ వేడి పదార్ధాలతోనే స్నేహం చేస్తాం. ఇది అంత మంది అలవాటు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. గోరువెచ్చని వరకు పర్లేదు.. మరింత వేడిగా అంటే లేనిపోని ఆహార సమస్యలకు ఆహ్వాని పలికినట్లే అవుతుందట..
Updated on: Dec 27, 2024 | 1:26 PM

చలికాలంలో శరీరం, మనసు వెచ్చగా ఉండేందుకు ఇష్టపడుతుంది. దీంతో వేడి ఆహారాన్ని తినాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చల్లటి వాతావరణం వల్ల శరీరం వెచ్చగా ఉండాలంటే వేడి వేడి ఆహారాన్ని తినాలను కోవడం సహజం. మీకు కూడా ఈ అలవాటు ఉంటే ఈరోజే వదిలేయడం మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అవును.. వేడిగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తింటే శరీరంలోని అనేక భాగాలను దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అతిగా వేడిచేసిన ఆహారం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా నాలుకకు కూడా హానికరం.

వేడిగా ఉండే ఆహారం తింటే నాలుక కూడా మండుతుంది. నాలుక చాలా సున్నితంగా ఉంటుంది. వేడి ఆహారాన్ని తినడం వల్ల కొన్ని రోజుల వరకు ఆహారాన్ని రుచి చూడలేరు. అంతేకాకుండా, చాలా వేడి ఆహారాన్ని తీసుకోవడం వల్ల గొంతులో వాపు సంభవిస్తుంది.

కడుపు లోపల చర్మం సున్నితంగా ఉంటుంది. వెచ్చని ఆహారాన్ని శరీరం త్వరగా అంగీకరించదు. దీన్ని తీసుకోవడం వల్ల కడుపునొప్పి, ఒళ్లు నొప్పులు తదితర సమస్యలు వస్తాయి. గ్యాస్ సమస్యతో పాటు పేగులు దెబ్బతింటాయి. కాబట్టి వీలైనంత తక్కువ వేడి ఉన్న ఆహార పదార్థాలను తినడం ఆరోగ్యానికి మంచిది.

వేడి ఆహారం తినడం, వేడి సూప్ తాగడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. ఆహారం వేడిగా ఉన్నందున, ఎనామెల్‌పై పగుళ్లు ఏర్పడుతుంది. ఇది శాశ్వత నష్టాన్ని కలిగిస్తుంది.




