- Telugu News Photo Gallery Cinema photos Has Janhvi Kapoor reduced her focus on bollywood know the reasons why
Janhvi Kapoor: నార్త్ మీద జాన్వీ ఫోకస్ తగ్గించారా ?? మొత్తానికి సినిమాలే తగ్గించార ??
జాన్వీ కపూర్ నార్త్ మీద ఫోకస్ తగ్గించారా? లేకుంటే పూర్తిగా సినిమాలే తగ్గిస్తున్నారా? ఈ విషయం మీదే డిబేట్ జరుగుతోంది నార్త్ సర్కిల్స్ లో. ఆఫ్టర్ దేవర జాన్వీ వే ఆఫ్ థింకింగ్‌లో మార్పు వచ్చిందా? దక్షిణాది సినిమాలతోనే వరల్డ్ ఫేమస్ కావాలని ఫిక్సయిపోయారా? కమాన్ లెట్స్ వాచ్... తంగం కేరక్టర్‌తో సౌత్ జనాలకు హలో చెప్పేశారు అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్.
Updated on: Dec 27, 2024 | 1:19 PM

తంగం కేరక్టర్‌తో సౌత్ జనాలకు హలో చెప్పేశారు అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ఈ సినిమా 500 కోట్లు మార్కు దాటడంతో పాటు జాన్వీలోని గ్లామర్ ప్లస్ పెర్ఫార్మెన్స్ యాంగిల్స్ ని సౌత్ ఆడియన్స్ కి స్పెషల్‌గా పరిచయం చేసింది.

దేవర తర్వాత నార్త్ అండ్ సౌత్ లో సైలెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు జాన్వీ. లేటెస్ట్ గా ఆమె నటిస్తున్న పరమసుందరి గ్లింప్స్ వచ్చేసింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఆమె యాక్ట్ చేసిన పరమసుందరి వచ్చే ఏడాది జులై 25న విడుదల కానుంది. ఇందులోనూ చీరకట్టుతో సందడి చేస్తున్నారు జాన్వీ.

పరమసుందరి కాకుండా నార్త్ లో ఒకే ఒక సినిమా ఉంది ఈ బ్యూటీ చేతిలో. సన్నీ సంస్కారి కి తులసి కుమారి అనేది ఆ ప్రాజెక్ట్ పేరు. ఆ తర్వాత ఏం చేయబోతున్నారంటే ప్రస్తుతానికి నో డేటా అంటోంది వికీ... కానీ తెలుగులో ఇప్పటికే చరణ్‌తో జోడీ కట్టేస్తున్నారు జాన్వీ పాపా.

బుచ్చిబాబు సానా సినిమా తర్వాత తెలుగులో మహేష్ - జక్కన్న మూవీకి జాన్వీ సై అన్నారనే వార్తలు ఎప్పటి నుంచో గుప్పుమంటున్నాయి. రాజమౌళి ఓపెన్ స్టేట్‌మెంట్ ఇస్తేగానీ దాని గురించి పక్కాగా క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

ఎటొచ్చీ దేవర పార్ట్ 2 లో మాత్రం ఆమె హల్‌చల్ చేయడం ఖాయం. అప్పటిదాకా చెర్రీ సినిమా కోసం వెయిట్ చేస్తాం అంటున్నారు ఫ్యాన్స్.




