- Telugu News Photo Gallery Cinema photos Sai Pallavi movies revolving around Telangana traditions including next movie Yellamma with Nithiina
Sai Pallavi: తెలంగాణ కథలతో కనెక్ట్ అవుతున్న సాయిపల్లవి
సాయిపల్లవికి, తెలంగాణ ప్రాంతానికి ఏదో తెలియని లింక్ ఉంది. లేకుంటే, తెలంగాణకు సంబంధించిన పాత్రలన్నీ ఆమెను వెతుక్కుంటూ వెళ్లడం ఏంటనే మాట చాలా సార్లు విన్నాం. లేటెస్ట్ గా పల్లవి మరోసారి తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టోరీకి సిగ్నల్స్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఫిదా సినిమాతోనే జనాలను మెప్పించారు సాయిపల్లవి. ఆ సినిమాలో ఆమె తెలంగాణ శ్లాంగ్ మాట్లాడుతుంటే ఫిదా అయిపోయారు జనాలు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Dec 27, 2024 | 1:19 PM

ఫిదా సినిమాతోనే జనాలను మెప్పించారు సాయిపల్లవి. ఆ సినిమాలో ఆమె తెలంగాణ శ్లాంగ్ మాట్లాడుతుంటే ఫిదా అయిపోయారు జనాలు. పక్కా తెలంగాణ పల్లె పిల్లగా ఆమె నటనను చూసి భానుమతి నిజంగానే సింగిల్ పీస్ అనుకున్నారు.

రానాతో నటించిన విరాటపర్వంలోనూ తెలంగాణ యాసను ఇరగదీశారు సాయిపల్లవి. రవన్నను వెతుక్కుంటూ వెళ్లే అమ్మాయిగా సూపర్బ్ అనిపించుకున్నారు. నచ్చినవాడి కోసం ఊరూ వాడా దాటి వెళ్లిన ఆమె కేరక్టర్ ఇంకా జనాల గుండెల్లో మెదులుతూనే ఉంది.

కొంతకాలంగా సినిమాలకు కాస్త దూరంగానే ఉన్న పల్లవి రీసెంట్‌గా అమరన్‌తో సందడి చేశారు. స్క్రీన్ మీద ఆమె నటించారా? జీవించేశారా? అన్నంతగా మెస్మరైజ్ అయ్యారు జనాలు.

ఉత్తరాంధ్ర బిడ్డగా నటించిన తండేల్ వచ్చే ఏడాది పలకరించనుంది. మరో వైపు ఆమె పక్కా తెలంగాణ సబ్జెక్టుతో రూపొందనున్న ఎల్లమ్మ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే మాటలు వినిపిస్తున్నాయి.

బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్టు టాక్. ఈ వార్త నిజమైతే మన రౌడీ బేబీ మరోసారి తెలంగాణ వీధుల్లో హల్‌చల్ చేయడం గ్యారంటీ అన్నమాట.





























