Personality Test: మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట.. ఓసారి చెక్ చేసుకోండి.!

ఎవరు ఎలా ఉన్నా, మీరు ఒక వ్యక్తిని కలిసినప్పుడు, ఆ వ్యక్తి మంచోడా.? చెడ్డోడా.? అతని వ్యక్తిత్వం ఎలాంటిది.? అని తెలుసుకోవాలనుకుంటే.! ఆ వ్యక్తితో కాసేపు మాట్లాడితే అతడి వ్యక్తిత్వం ఏమిటో అర్థమవుతుంది. అయితే అలా కాకుండా.. కేవలం చేతి వేళ్లతో..

Personality Test: మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట.. ఓసారి చెక్ చేసుకోండి.!
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 27, 2024 | 3:30 PM

ప్రపంచంలోని మనుషుల రూపురేఖలు మాత్రమే కాదు.. వారి కదలికలు విభిన్నంగా ఉంటాయి. అలాగే ఒకరి స్వభావం, మరొకరితో పొంతన ఉండదు. మరి ఇతరుల వ్యక్తిత్వం ఎలాంటిది.? వారి వ్యక్తిత్వ స్వభావాలు ఎలాంటివో తెలియాలంటే వారితో కొంత సమయం గడపాల్సిన అవసరం లేదు. కేవలం చేతి వేళ్ల ఆకారంతో కనిపెట్టేయొచ్చునని హస్త సాముద్రికత నిపుణులు చెబుతున్నారు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

స్ట్రెయిట్ ఫింగర్స్: చేతుల వేళ్లు నిటారుగా ఉంటే, ఆ వ్యక్తులు నిజాయితీపరులు. అతనిలో నిజం చెప్పే గుణం ఎక్కువ, అందరి నమ్మకాన్ని పొందుతాడు. ఎవరినీ మోసం చేయని, అబద్ధాలు చెప్పని వ్యక్తిత్వం ఆ వ్యక్తులది. విషయాలను సూటిగా చెప్పే స్వభావం వారిది. స్వతంత్ర వ్యక్తిగా జీవించడానికి ఇష్టపడతారు. వీరితో స్నేహం చేసేందుకు కొంచెం కష్టమే.

షార్ట్ ఫింగర్స్: వీరు ఆచరణాత్మక లక్షణాలు కలిగిన వ్యక్తులు. టైం మేనేజ్‌మెంట్‌లో, ఆర్గనైజింగ్‌లో వీరిని మించిన వారు ఎవరూ లేరు. వారు ఏ అంశం అయినా అత్యంత విశ్లేషణాత్మకంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

పాయింటెడ్ ఫింగర్స్: ఈ వ్యక్తులు ఎక్కువగా కలలు కంటారు. వీరి స్వభావం వాస్తవికతకు దూరంగా ఉంటుంది. వీరు సెన్సిటివ్ పీపుల్ అయినప్పటికీ, తమ కలలు, లక్ష్యాలను సాధించడానికి ఎలప్పుడూ ప్రయత్నిస్తారు. అందుకే వీరిలో నాయకత్వ గుణం ఎక్కువగా ఉంటుంది.

క్రాస్‌డ్ ఫింగర్స్: ఈ వ్యక్తులు ఓపెన్ మైండెడ్. ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. వీరికి కోపం తక్కువ. రద్దీగా ఉండే ప్రదేశాలలో ఉండటం ఇష్టం ఉండదు. అయితే తమ మాటలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

చూపుడు వేలు, ఉంగరపు వేలు ఒకే పొడవు ఉంటే: ఈ రెండు వేళ్లు ఒకే పొడవుతో ఉంటే, వీరు సమతుల్య జీవితాన్ని గడుపుతారు. శ్రద్ధ, నమ్మకమైన, సున్నితమైన వ్యక్తులు.. అలాగే మంచి శ్రోతలు. ఎదుటి వారి సమస్యలను వింటూ వారికి సహాయం చేయడంలో వీరిదే పైచేయి అని చెప్పొచ్చు. అలా వారు ఎక్కువ మంది స్నేహాన్ని గెలుచుకుంటారు.

ఉంగరపు వేలు కంటే చూపుడు వేలు పొడవుగా ఉంటే: ఇలా ఉన్నవారికి.. వారిపై వారికి నమ్మకం ఎక్కువ. ఇతరులకు సలహాలు ఇవ్వడంలో నేర్పరులు. నిర్ణయాలు తీసుకునే ముందు వందసార్లు ఆలోచిస్తారు. వారు చేసే పనుల పట్ల మరింత జాగ్రత్తగా ఉంటారు.

ఉంగరపు వేలు చూపుడు వేలు కంటే పొడవుగా ఉంటే: ఈ వ్యక్తులలో ఎక్కువ ఆత్మవిశ్వాసాన్ని చూడవచ్చు. వారు దయగల స్వభావాన్ని కలిగి ఉంటారు. జీవితంలోని ప్రతి అంశం గురించి చాలా ఆలోచనాత్మకంగా ఉంటారు. వీరి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కారణంగా ప్రజలు అతని పట్ల మరింతగా ఆకర్షితులవుతారు.

ఇది చదవండి: ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!