Telangana: గ్రామ పంచాయతీలకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు..
తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఇటీవలే నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద మరో రూ. 387 కోట్లను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు అభివృద్ధికి మరో విడత నిధులు విడుదలకు నిర్ణయం తీసుకుంది. ఇటీవలే 15వ ఆర్ధిక సంఘం గ్రాంట్ల కింద మొదటి విడతగా రూ.259.36 కోట్లను కేంద్ర విడుదల చేయగా.. తాజాగా రెండో విడత నిధుల కింద రూ. 387 కోట్లను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్ధికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే గ్రామ పంచాయతీల్లో పాలకుల పదవీకాలం ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం గతంలో నిధుల విడుదలను ఆపేసింది. దీంతో ఇటీవలే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి కొత్తపాలకులు రావడంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సాంకేతిక వివరాలను సమర్పించి నిధులు విడుదల చేయాలని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం ఇటీవలే మొదటి విడత నిధులు విడుదల చేయగా తాజాగా రెండో విడత నిధులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
అయితే15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి మొత్తం రూ.3000 వేల కోట్ల నిధులు రావాల్సి ఉండగా.. ప్రభుత్వం విడితల వారీగా నిధులను విడుదల చేస్తోంది. ఇప్పటికే రెండు విడతల కింద ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయగా ఇంకా సుమారు రూ. 2,400 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
