AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ అనుభూతి జిబ్రానిక్స్‌ జెబ్‌–పిక్సా ప్లే 72 ప్లస్‌తో సొంతం.. ఫీచర్లు ఇవే

ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పొందేలా ప్రముఖ బ్రాండ్ అదిరిపోయే స్మార్ట్ ప్రొజెక్టర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తక్కువ బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్ విజువల్స్, అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త డివైస్ టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీని ప్రత్యేకతలు, ధర వివరాలు తెలుసుకుందాం.

తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ అనుభూతి జిబ్రానిక్స్‌ జెబ్‌–పిక్సా ప్లే 72 ప్లస్‌తో సొంతం.. ఫీచర్లు ఇవే
Zebronics Zeb Pixaplay 72 Plus Smart Projector
Nikhil
|

Updated on: Jul 30, 2026 | 9:50 PM

Share

హోమ్ ఎంటర్‌టైన్మెంట్ విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ జిబ్రానిక్స్ భారత మార్కెట్లో కొత్త జెబ్-పిక్సాప్లే 72 ప్లస్ స్మార్ట్ ప్రొజెక్టర్‌ను విడుదల చేసింది. తక్కువ ధరలోనే పెద్ద స్క్రీన్‌పై సినిమాలు, వెబ్ సిరీస్‌లు, గేమింగ్ అనుభవాన్ని అందించేలా ఈ ప్రొజెక్టర్‌ను తీర్చిదిద్దారు.

జెబ్-పిక్సాప్లే 72 ప్లస్ ప్రొజెక్టర్ 1280×720 హెచ్‌డీ నేటివ్ రిజల్యూషన్‌తో వస్తుంది. అయినప్పటికీ ఫుల్ హెచ్‌డీ 1080p కంటెంట్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. నలభై అంగుళాల నుంచి 304 సెంటీమీటర్ల వరకు స్క్రీన్‌ను ఇది ప్రొజెక్ట్ చేయగలదు. నాలుగు వేల ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌తో స్పష్టమైన విజువల్స్ అందిస్తుంది.

ఈ స్మార్ట్ ప్రొజెక్టర్‌లో ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ను అందించారు. దీంతో యాప్‌లను నేరుగా ఉపయోగించి వినోద కంటెంట్‌ను వీక్షించవచ్చు. ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కోసం అదనపు డివైస్ అవసరం ఉండదు. కనెక్టివిటీ కోసం వైఫై 6 డ్యూయల్-బ్యాండ్, బ్లూటూత్ 5.4, హెచ్‌డీఎంఐ ఏఆర్‌సీ, యూఎస్‌బీ, ఆక్స్ అవుట్ పోర్ట్‌లను అమర్చారు. అలాగే మిరాకాస్ట్, ఐఓఎస్ స్క్రీన్ మిర్రరింగ్ సపోర్ట్ ఉండటంతో ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైస్‌ల నుంచి వైర్‌లెస్‌గా కంటెంట్‌ను ప్రొజెక్ట్ చేసుకోవచ్చు.

టిల్ట్ మెకానిజం ..

ఈ ప్రొజెక్టర్‌లో ఆటో కీస్టోన్ అడాప్టేషన్ ఫీచర్ ఉండటం వల్ల స్క్రీన్‌ను ఆటోమేటిక్‌గా సరిచేస్తుంది. అలాగే రెండు వందల డిగ్రీల టిల్ట్ మెకానిజం కారణంగా వివిధ కోణాల్లో సులభంగా ప్రొజెక్ట్ చేసే వెసులుబాటు ఉంది. ఇందులో బిల్ట్-ఇన్ స్పీకర్, రిమోట్ కంట్రోల్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ ప్రొజెక్టర్ 30,000 గంటల వరకు ల్యాంప్ లైఫ్‌ను అందిస్తుంది. అంటే చాలా సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రొజెక్షన్ దూరం 1.2 మీటర్ల నుంచి 4 మీటర్ల వరకు ఉంటుంది.

ప్రొజెక్టర్ ధర..

భారత మార్కెట్లో దీని ప్రారంభ ఆఫర్ ధర రూ. 5,499కు అందుబాటులోకి వచ్చింది. దీని అసలు ఎంఆర్‌పీ ధరను రూ. 12,999గా కంపెనీ ప్రకటించింది. ఈ అత్యాధునిక స్మార్ట్ ప్రొజెక్టర్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, అలాగే దేశంలోని ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. తక్కువ బడ్జెట్‌లో హోమ్ థియేటర్ అనుభూతిని పొందాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.

Follow Us