AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో కోళ్లకు వచ్చే అతి భయంకరమైన రోగం ఇదే.. ఇలా చేస్తే బతుకుతాయంట..

వర్షాకాలంలో కోళ్లను ఎక్కువగా వేధించే ప్రమాదకరమైన వ్యాధుల్లో కాక్సీ డయేరియా (కాక్సిడియోసిస్) ఒకటి. ఈ వ్యాధి సోకితే కోళ్లు బలహీనపడి మరణించే ప్రమాదం ఉంటుంది. లక్షణాలు, నివారణ చర్యలు, చికిత్సకు సంబంధించిన సాధారణ అవగాహనతో పాటు.. కోళ్లలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వెటర్నరీ వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.

వర్షాకాలంలో కోళ్లకు వచ్చే అతి భయంకరమైన రోగం ఇదే.. ఇలా చేస్తే బతుకుతాయంట..
Chicken Disease
Shaik Madar Saheb
|

Updated on: Jul 30, 2026 | 7:42 PM

Share

వర్షాకాలం కోళ్ల పెంపకందారులకు అనేక ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఈ సీజన్‌లో కోళ్లకు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా రైతులు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత చాలామంది రైతులు తమ కోళ్లు మరణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల పెంపకందారులు.. పాత కోళ్లకు వ్యాక్సిన్లు, నాణ్యమైన ఫీడ్, మందులు ఇస్తున్నప్పటికీ చనిపోవడంతో తీవ్ర ఆవేదన చెందారు. అయితే.. ల్యాబ్‌లో జరిపిన పరీక్షల తర్వాత కోళ్ల మరణాలకు కాక్సీ డయేరియా అనే వ్యాధి కారణమని నిర్ధారణ అయ్యింది. ఈ వ్యాధి సోకిన సాధారణ లేదా జాతి కోళ్లు, బ్రాయిలర్ కోళ్లు తీవ్రంగా బలహీనపడతాయి. వాటి బోరలు ఎండిపోయి, తోకలు కిందికి వేలాడదీస్తాయి. ఈ స్థితిలో కోళ్లు ఎంత లివర్ టానిక్‌లు, ఇతర మందులు ఇచ్చినా, ఇంజెక్షన్లు చేసినా కోలుకోవడం కష్టం అని వెటర్నరీ డాక్టర్లు పేర్కొంటున్నారు. కాక్సీ డయేరియా వర్షాకాలంలో మరింత తీవ్రంగా మారుతుందని, అందుకే రైతులు అప్రమత్తంగా ఉండాలని కోళ్ల పెంపకం దారులు సూచిస్తున్నారు.

వెటర్నరి డాక్టర్లు కాక్సీ డయేరియాకు కొన్ని నిర్దిష్ట మందులను సూచిస్తున్నారు. వాటిలో ప్రధానమైనవి:

సూపర్ కాక్స్ పౌడర్: ఇది కాక్సీ డయేరియా చికిత్సకు ఉపయోగపడే ముఖ్యమైన మందు. దీనిని 1 గ్రాము చొప్పున 1 లీటరు నీటిలో కలిపి ఐదు రోజుల పాటు కోళ్లకు అందించాలి.

ఆప్టిబ్లెండ్: ఇది సూపర్ కాక్స్ పౌడర్‌తో కలిపి ఇవ్వాల్సిన మందు. దీనిని 20 కోళ్లకు 5 ఎంఎల్ చొప్పున లెక్కించి, సూపర్ కాక్స్ పౌడర్ కలిపిన నీటిలోనే ఉదయం పూట ఐదు రోజుల పాటు అందించాలి. ఉదాహరణకు, 40 కోళ్లు ఉన్నట్లయితే 10 ఎంఎల్ ఆప్టిబ్లెండ్ వాడాలి.

లివోటాస్ – లివర్ టానిక్: ఇది కాలేయ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. లివోటాస్ (కాలేయ టానిక్) ను 20 కోళ్లకు 10 ఎంఎల్ చొప్పున, ఐదు రోజుల పాటు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు అందించాలి. 40 కోళ్లకు 20 ఎంఎల్ లివోటాస్ అవసరం.

ఈ మందులను సరైన మోతాదులో, సరైన సమయాల్లో వాడటం ద్వారా కాక్సీ డయేరియా ప్రభావాన్ని తగ్గించి, కోళ్లను రక్షించుకోవచ్చు. వెటర్నరీ షాపులలో ఈ మందులు అందుబాటులో ఉంటాయి. కోళ్లు అస్వస్థతకు గురైనప్పుడు వెంటనే నిపుణులను సంప్రదించి, సరైన చికిత్స తీసుకోవడం అత్యంత ముఖ్యం. వర్షాకాలంలో కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు పాటించి, సకాలంలో వ్యాధి నిర్ధారణ, చికిత్స అందించడం ద్వారా రైతులు లాభ నష్టాల సమతుల్యతను కాపాడుకోవచ్చు..

అయితే.. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. కోళ్లకు ఏమైనా సమస్యలుంటే.. నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Follow Us
వర్షాకాలంలో కోళ్లకు వచ్చే అతి భయంకరమైన రోగం ఇదే..
వర్షాకాలంలో కోళ్లకు వచ్చే అతి భయంకరమైన రోగం ఇదే..
BITS పిలానీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఆగస్టు 15లోపు అప్లై చేయండి..
BITS పిలానీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఆగస్టు 15లోపు అప్లై చేయండి..
ఏపీలో మరో కొత్త పథకం.. అకౌంట్లోకి రూ.25 వేలు.. ఆ రోజే..
ఏపీలో మరో కొత్త పథకం.. అకౌంట్లోకి రూ.25 వేలు.. ఆ రోజే..
ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి AI అండ.. రూ.1.5 కోట్ల ప్యాకేజీతో జాబ్
ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి AI అండ.. రూ.1.5 కోట్ల ప్యాకేజీతో జాబ్
ఆధార్, ఓటర్ ఐడీతోనే పౌరసత్వం రుజువు కాదు.. కలకత్తా హైకోర్టు
ఆధార్, ఓటర్ ఐడీతోనే పౌరసత్వం రుజువు కాదు.. కలకత్తా హైకోర్టు
ఆనందం+మనశ్శాంతికి కేరాఫ్ ఆదే..! రమణ మహర్షి గొప్ప సందేశం
ఆనందం+మనశ్శాంతికి కేరాఫ్ ఆదే..! రమణ మహర్షి గొప్ప సందేశం
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ విలన్ ఎలా చనిపోయారో తెలుసా?
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ విలన్ ఎలా చనిపోయారో తెలుసా?
మీ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కట్ అయినా ఫిర్యాదు చేయొచ్చు..
మీ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కట్ అయినా ఫిర్యాదు చేయొచ్చు..
ఫించన్‌ డబ్బులు తీసుకొని ఇంటికి బయల్దేరిన మహిళ.. గమ్యం చేరకుండానే
ఫించన్‌ డబ్బులు తీసుకొని ఇంటికి బయల్దేరిన మహిళ.. గమ్యం చేరకుండానే
సూర్యతో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ?
సూర్యతో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ?