AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరెంటు మీటర్‌లోని రెడ్‌లైట్‌ స్పీడ్‌గా బ్లింక్ అవుతుందా?.. ఈ మంత్‌ మీ జేబుకు చిల్లే!

కరెంట్ మీటర్.. ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది విద్యుత్ వినియోగాన్ని నమోదు చేయడంతో పాటు సరఫరాలో సాంకేతిక లోపాలను సూచిస్తుంది. అయితే ఈ మీటర్‌లో ఎప్పుడూ ఒక రెడ్ లేదా ఎల్లో లైట్‌ వెలుగుతూ ఉండటం మీరు ఎప్పుడైనా గమనించారా? ఇది సరిగ్గా పనిచేయకపోతే.. ఈ నెల వచ్చే కరెంట్ బిల్లు మనకు షాక్ ఇస్తుంది. అసలు ఈ లైట్ ఏం పనిచేస్తుంది? ఇది ఆగిపోతే ఏం జరుగుతుందో మీటర్ వాడే 100 మందిలో 90 మందికి తెలియదు. కాబట్టి దీని గురించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Oct 07, 2026 | 11:21 AM

Share
మన ఇంట్లో వాడే కరెంట్ మీటర్‌లో అనేక చిన్న చిన్న లైట్లు, ఇండికేటర్లు ఉంటాయి. ఇవి ఒక్కోటి ఒక్కో పని చేస్తాయి. కొన్ని విద్యుత్ వినియోగాన్ని సూచిస్తే, మరికొన్ని విద్యుత్ లోడ్, లీకేజీ లేదా మీటర్‌తో ఏదైనా ట్యాంపరింగ్ జరిగిందా అనే విషయాలను తెలియజేస్తాయి. ఈ ఇండికేటర్లలో భాగంగా మీటర్‌లో ఒక ఎరుపు రంగు ఎల్‌ఈడీ (Red LED) లైట్ కూడా ఉంటుంది.

1 / 5
ఇది నిరంతరం బ్లింక్ అవుతూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఇది చాలా వేగంగా (స్పీడ్‌గా), మరికొన్ని సార్లు నెమ్మదిగా బ్లింక్ అవుతుంది. ఇక్కడ ఈ లైట్ బ్లింక్ అయ్యే తీరును మీరు ఎప్పుడూ లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇది సరిగ్గా పనిచేయకపోతే.. ఆ నెల మీ జేబుకు పెద్ద చిల్లే పడొచ్చు. ఈ రెడ్ లైటే కరెంట్ బిల్లులను నిర్ధారిస్తుందని చెప్పవచ్చు.

2 / 5
అవును, ఈ లైట్ నెమ్మదిగా బ్లింక్ అయితే మీ ఇంట్లో విద్యుత్ వినియోగం సాధారణంగా (నార్మల్‌గా) ఉందని అర్థం. అంటే మీ ఇంట్లో ఎక్కువ పవర్ వినియోగించే పరికరాలు ప్రస్తుతం రన్నింగ్‌లో లేవని అర్థం చేసుకోవచ్చు. అదే ఆ రెడ్ లైట్ కనుక వేగంగా బ్లింక్ అవుతూ ఉంటే.. ఎక్కువ విద్యుత్ తీసుకునే ఉపకరణాలు రన్ అవుతున్నాయని అర్థం. సాధారణంగా ఇంట్లో హీటర్, గీజర్, ఏసీ (AC) వంటివి వాడినప్పుడు ఈ లైట్ వేగంగా బ్లింక్ అవుతుంది. అంటే అవి ఎక్కువ పవర్‌ను వినియోగిస్తున్నాయని సంకేతం.

3 / 5
అయితే, కొన్నిసార్లు ఎక్కువ పవర్ వినియోగించే పరికరాలు ఆన్‌లో లేకపోయినా, సాంకేతిక సమస్య కారణంగా కొన్నిసార్లు ఈ లైట్ వేగంగా బ్లింక్ అవుతూ ఉంటుంది. మరి దీన్ని తెలుసుకోవడం ఎలాగంటే.. మీ ఇంట్లోని అన్ని స్విచ్‌లు, పరికరాలను పూర్తిగా ఆఫ్ చేసి.. కేవలం మెయిన్ ఎంసీబీని (MCB) మాత్రమే ఆన్‌లో ఉంచాలి. అయినా కూడా మీటర్‌లోని రెడ్ లైట్ వేగంగా బ్లింక్ అవుతూ, యూనిట్లు పెరుగుతూ ఉంటే.. మీటర్‌లో లోపం ఉందని గుర్తించాలి.

4 / 5
దీన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు లేదా ఎలక్ట్రీషియన్‌కు సమాచారం అందించి.. అందులోని సమస్యను సరిచేయించాలి. లేదంటే అది నేరుగా విద్యుత్ బిల్లుపై తీవ్ర ప్రభావం చూపి, వినియోగదారులకు ఊహించని రీతిలో భారీ బిల్లులు వచ్చే అవకాశముంది. కాబట్టి ఎప్పుడూ ఈ లైట్‌ను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి.. అందులో ఎలాంటి మార్పులు కనిపించినా వెంటనే అప్రమత్తమై, కరెంట్ బిల్లు పెరగకుండా చూసుకోండి.

5 / 5
Follow Us