AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Bhagavan: ఆ హీరో నాకు ఆప్త మిత్రుడు.. సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..

ప్రముఖ హాస్యనటుడు కృష్ణ భగవాన్ తెలుగు సినిమా హాస్యం , సీనియర్ నటులతో తన అనుబంధం, ముఖ్యంగా టాలీవుడ్ హీరోతో తనకున్న ప్రత్యేక స్నేహం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హాస్యం కూడా ప్రపంచంలాగే నిరంతరం మారుతుందని, పంచ్ డైలాగుల కంటే సిట్యుయేషనల్ కామెడీని తాను ఎక్కువగా ఇష్టపడతానని ఆయన తెలిపారు. సన్నివేశం బలంగా ఉంటే హాస్యం దానంతటదే పండుతుందని ఆయన అన్నారు.

Krishna Bhagavan: ఆ హీరో నాకు ఆప్త మిత్రుడు.. సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
Krishna Bhagavan
Rajitha Chanti
|

Updated on: Jul 30, 2026 | 11:16 PM

Share

తెలుగు సినిమా హాస్య ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న నటుడు కృష్ణ భగవాన్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన హాస్యం పరిణామక్రమం, సీనియర్ నటులతో తన అనుభవాలు, నటుడు అల్లరి నరేష్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి పంచుకున్నారు. హాస్యం అనేది కాలంతో పాటు మారుతుందని, ప్రపంచం ఎలా మారుతుందో దాని ప్రకారం కామెడీ కూడా రూపాంతరం చెందుతుందని అన్నారు. కృష్ణ భగవాన్ పంచ్ డైలాగుల కంటే సిట్యుయేషనల్ కామెడీని ఎక్కువగా ఇష్టపడతానని చెప్పారు. “సందర్భమే నవ్విస్తుంది. అందులో పంచ్ లు, జోకులు వేయక్కర్లేదు” అని ఆయన అన్నారు. సరైన సిట్యుయేషన్ ఉంటే, “అలాగేనండి” వంటి సాధారణ పదం కూడా నవ్వు తెప్పిస్తుందని ఉదాహరించారు. ఈ రకమైన హాస్యం ఎప్పుడూ, ఎక్కడైనా బాగుంటుందని తెలిపారు. హాస్యం కొన్నిసార్లు వల్గారిటీలోకి వెళ్ళినా, అది ఎప్పుడూ సమాంతరంగా నడుస్తూనే ఉంటుందని ఆయన పేర్కోన్నారు.

పాత తరం హాస్యనటులతో తనకున్న అనుబంధాన్ని కృష్ణ భగవాన్ ఎంతో ఆనందంగా గుర్తుచేసుకున్నారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, ఎం.ఎస్. నారాయణ, కొండవలస లక్ష్మణరావు, బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్ వంటి దిగ్గజాలతో కలిసి పనిచేశానని ఆయన చెప్పారు. “సినిమాలో చేసే దాని కన్నా, బయట కూర్చుని, ఆ చెట్టు కింద కూర్చుని బాగుండేది” అని ఆ రోజులను నెమరువేసుకున్నారు. అప్పట్లో క్యారవాన్‌లు ఉన్నా, తామంతా కుర్చీల్లోనే కూర్చునేవారని, కబుర్లు చెప్పుకుంటూ, లంచ్ కూడా బయటే చేసేవారని ఆయన అన్నారు. దీనివల్ల ఎక్కువ స్నేహాలు ఏర్పడేవని ఆయన పేర్కొన్నారు.

ఎం.ఎస్. నారాయణ, బ్రహ్మానందం ఇద్దరూ లెక్చరర్లుగా పనిచేసి వచ్చారని కృష్ణ భగవాన్ గుర్తుచేశారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి, ఆస్వాదించడం వారికి అలవాటు అని, మంచి స్టూడెంట్స్ పట్ల ఉండే ఆ ఫీలింగ్ వారిలో ఎప్పుడూ ఉంటుందని అన్నారు. బ్రహ్మానందం గారిలో అందరినీ మెచ్చుకునే గుణం ఉందని, తాను వేసిన జోకులను హీరోలందరికీ చెప్పి, మళ్ళీ తనతో “ఇలా చెప్పాను” అని చెప్పేవారని కృష్ణ భగవాన్ తెలిపారు. ఏదైనా మాట్లాడితే దానిని ఎలివేట్ చేసి గొప్పగా చెప్పేవారని, సీనియర్లు తన మాటలను మళ్లీ చెప్పి నవ్వుకోవడం బాగుండేదని ఆయన పాత రోజులను తలచుకున్నారు.

కృష్ణ భగవాన్‌కు అత్యంత సన్నిహిత నటుడిగా అల్లరి నరేష్ ఉన్నారని ఆయన వెల్లడించారు. “నేను అందరినీ అడిగే మాట కాదు. మీరు ఏదో ఒక పక్కన కూర్చుని, ఆ ఒళ్ళో పడిపోయే మనిషి కాదు మీరు. వెళ్లి, దూసుకుని వెళ్లి… అంటే ఏదో ఉంటే అది చాలా క్లీన్ గా ఇది మాట్లాడుకునేది అల్లరి నరేష్ అండి” అని స్పష్టం చేశారు. ఈవీవీ సత్యనారాయణ గారి చిత్రాలైన కితకితలు, మా అల్లుడు వెరీ గుడ్, అత్తిలి సత్తిబాబు వంటి సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించడం ద్వారా ఈ అనుబంధం ఏర్పడిందని చెప్పారు. నరేష్ తనకన్నా వయసులో చిన్నవాడని, అప్పట్లో ఏ విషయం గురించైనా ఇద్దరూ చర్చించుకునే వారని అన్నారు.

అల్లరి నరేష్ కృషిని, ప్రగతిని కృష్ణ భగవాన్ ఎంతగానో కొనియాడారు. “చాలా డే అండ్ నైట్ షూటింగ్, డే అండ్ నైట్ కష్టపడతాడు ఆయన” అని నరేష్ అంకితభావాన్ని ప్రశంసించారు. తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ ఒక కామెడీ హీరోగా నిలబెట్టిన బాధ్యతను నరేష్ కొనసాగిస్తూ, రాజేంద్ర ప్రసాద్ వంటి నటుల పరంపరను ముందుకు తీసుకువెళ్తున్నాడని ఆయన అన్నారు. కామెడీ చిత్రాలతో పాటు, నాంది, నేను వంటి సీరియస్ చిత్రాలలో కూడా నరేష్ అద్భుతంగా నటించి, తన బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకున్నారని కృష్ణ భగవాన్ పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..

Follow Us
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్‌ టెక్నాలజీ టార్మాక్ హెల్మెట్
హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్‌ టెక్నాలజీ టార్మాక్ హెల్మెట్
E20 పెట్రోల్‌ వాడకంపై కేంద్ర కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే?
E20 పెట్రోల్‌ వాడకంపై కేంద్ర కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే?