AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపర్ మార్కెట్‌కు వెళితే ఏం కొనాలో తెలియడం లేదా? ఈ చిట్కాలు పాటిస్తే డబ్బు ఆదానే

చాలా మంది సూపర్ మార్కెట్‌లో ఆఫర్స్ చూసి షాపింగ్ చేయడానికి, ముఖ్యంగా నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. కానీ చివరకు పెద్ద మొత్తంలో అమౌంట్ చెల్లించి, చింతిస్తుంటారు. అయితే ఇలా సూపర్ మార్కెట్‌కు వెళ్లి ఏం కొనుగోలు చేయాలో తెలియక, అన్నీ కొనేస్తుంటారు. అయితే అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే చాలు, డబ్బును ఆదా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jul 30, 2026 | 8:51 PM

Share
కొన్ని సార్లు కావాలనే సూపర్ మార్కెట్ వాళ్లు డిస్కౌంట్లు , ఉచితం వంటి ఆఫర్స్ పెడుతుంటారు.  కానీ వీటిని చూసి వెళ్లడం వలన జేబులు చిల్లులు పడటం ఖాయం అంటున్నారు నిపుణులు. అందుకే సూపర్ మార్కెట్‌కు వెళ్లే సమయంలో తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి ఏవి అంటే?

1 / 5
మీరు సూపర్ మార్కెట్‌కు వెళ్లే ముందు , మీ ఇంటికి సంబంధించిన నిత్యవసర వస్తువులను, మీరు తీసుకోవాల్సిన సామాను మొత్తం ఒక పేపర్ మీద రాసుకోవాలి. ఒక జాబితాను రెడీ చేసుకొని, వాటి ప్రకారం మాత్రమే మీరు కొనుగోలు చేయాలి. మీరు జాబితా ప్రకారం షాపింగ్ చేయడం వల్ల రెండు ప్రధాన ప్రయోజనాలు ఉంటాయి. ముందుగా, మీరు అనవసరమైన వస్తువులను కొనడం మానుకుంటారు.రెండోది, మీరు అనవసరంగా ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదు. దీని వలన మీకు డబ్బు ఆదా అవుతుంది.

2 / 5
డిస్కౌంట్లు, అమ్మకాలకు ఆకర్షితులు అవ్వకూడదు, చాలా మంది 50 శాతం డిస్కౌంట్ అనగానే వాటిని కొనుగోలు చేస్తుంటారు. కానీ మీరు అవసరం లేకపోయినా దానిని కొనుగోలు చేస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోతారు. దీని వలన మీరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా డిస్కౌంట్‌లకు ఆకర్షితులు అవ్వకూడదు.

3 / 5
కొంత మంది సూపర్ మార్కెట్‌కు వెళ్లిన తర్వాత పెద్ద ట్రాలీని తీసుకుంటారు. కానీ దానికి బదులు చిన్న బుట్టాలు ఉపయోగించడం మంచిది. పెద్ద ట్రాలీ ఉన్నప్పుడు మీరు ఎన్ని కొనుగోలు చేసారో మీకు అంతగా తెలియదు, చిన్న బుట్ట అయితే అవసరమైన వస్తువులతో నిండి పోతుంది. అందుకే వీటిని ఎంచుకునే విధానంలో కూడా తెలివిగా వ్యవహరించాలి. అప్పుడే డబ్బు కూడా ఆదా అవుతుంది.

4 / 5
అంతే కాకుండా కొంత మంది సూపర్ మార్కెట్‌కు వెళ్లిన తర్వాత సూపర్ మార్కెట్ మొత్తం తిరిగేస్తుంటారు. కానీ దీని వలన కూడా అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. కొత్త కొత్త వస్తువుల పట్ల ఆకర్షితులు అవుతారు. అందుకే కేవలం మీరు కొనుగోలు చేసే వస్తువులు ఉన్న చోటుకు వెళ్లడం చాలా మంచిది అని చెబుతున్నారు నిపుణులు.

5 / 5
Follow Us