AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. గుండెలు పగిలే దృశ్యం.. ఒక్కచోటనే తిష్టవేసిన మూడు కొండచిలువలు..

ఏలూరు: చిన్న పాము పిల్లను చూసినా భయంతో హడలిపోతాము. భయంతో.. దూరంగా పరుగెడుతాం.. కానీ ఒకేసారి మూడు కొండ చిలువలు కనిపిస్తే ఇంకేమన్నా ఉందా ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో ఒక పొలంలో మూడు కొండచిలువలు కనిపించటం తీవ్ర కలకలం రేపింది.

వామ్మో.. గుండెలు పగిలే దృశ్యం.. ఒక్కచోటనే తిష్టవేసిన మూడు కొండచిలువలు..
Python
B Ravi Kumar
| Edited By: |

Updated on: Feb 12, 2026 | 3:01 PM

Share

ఏలూరు: చిన్న పాము పిల్లను చూసినా భయంతో హడలిపోతాము. భయంతో.. దూరంగా పరుగెడుతాం.. కానీ ఒకేసారి మూడు కొండ చిలువలు కనిపిస్తే ఇంకేమన్నా ఉందా ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో ఒక పొలంలో మూడు కొండచిలువలు కనిపించటం తీవ్ర కలకలం రేపింది. రైతు పశువుల కొసంగడ్డి కోస్తుండగా కనిపించిన పాము రాళ్లలోకి వెళ్లింది. దానికోసం పొగ పెడితే మరో రెండు కొండ చిలువలు బయటపడ్డాయి. దీంతో వాటిని చంపేశారు స్థానికులు..

వీడియో చూడండి..

ఏలూరు జిల్లాలో ఇలా జరిగితే ఇండోనేషియాలోని అడవుల్లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన పామును స్థానికులు గుర్తించారు.

రిటిక్యులేటెడ్ పైథాన్ పొడవెంతో తెలుసా..

ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాము రిటిక్యులేటెడ్ పైథాన్.. 23 అడుగులకు పైగా పొడవు ఉన్న ఈ పాము గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఇది 96 కిలోల బరువు ఉంది. దీన్ని ఇండోనేషియాలోని సులావేసి దీవిలో కనుగొన్నారు. ఇంత పెద్ద పొడవైన, బరువైన పామును చూసి అక్కడిప్రజలు ఆశ్చర్యం పోయారు. రిటిక్యులేటెడ్ పైథాన్ విషరహితమైన పాము. ఇది సాధారణంగా అడవుల్లోనే జీవిస్తుంది. అయితే దాని భారీ పరిమాణం వల్ల చూసేవారికి భయకరంగా కనిపించి హడలి పోయేలా చేస్తుంది. ఇలాంటి అరుదైన పాములు అడవుల జీవ వైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యానికి కారణమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భయంతో అవి కనిపించగానే చంపి వేయటం కంటే వాటిని స్నేక్ క్యాచర్స్ సహాయంతో అడవుల్లో విడిచిపెట్టడం వల్ల పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని చెబుతున్నారు.

శరీరనిర్మాణంలో ప్రత్యేకత ఏంటి..

రిటిక్యులేటెడ్ పైథాన్ దక్షిణ ఆసియా దేశాల్లో ఇండోనేషియా, మలేషియా, ఫిలిపెయిన్స్, థాయ్ లాండ్, వియత్నాం తదితర దేశాల్లో కనిపిస్తుంది. అడవులు, చెరువులు, నదులు, గడ్డిభూమిల్లో సంచరిస్తుంటుంది. దాని శరీరంపై వల (జాలం) లాంటి ఆకృతి కనిపిస్తుండంతో దీన్ని రిటిక్యులేటెడ్ పైథాన్ అని పిలుస్తారు. గోధుమ, నలుపు, పసుపు రంగుల మిశ్రమంతో ఒకదానికి మరొకటి కలిసిన మచ్చలు వల లా కనిపిస్తుంటాయి. అడవిలో చెట్లు, ఆకులు, నేల లో కలిసిపోయే విధంగా దీని శరీరం పై రంగులు ఉండటంతో అది సులువుగా దాని ఆహారాన్ని వేటాడుతుంది. ఎలుకలు, కోళ్లు, జింకలు, పందుల తో పాటు చిన్న చిన్న మృగాలను ఇది వేటాడుతుంది. తనబలమైన శరీర కండరాలతో జంతువును బిగించి చంపుతుంది. రాత్రిపూట దీని కదలికలు చురుకుగా ఉంటాయి. నీటిలో వేగంగా ఈద గలగటం తో పాటు చెట్ల పైకి సైతం ఎక్కగలదు. ఆడపాము 20 నుంచి 80 గుడ్లుపెట్టి తనశరీరం తో చుట్టుకుని వేడి ని ఇవ్వటం ద్వారా సంరక్షిస్తుంది. ఈ గుడ్లు 80 నుంచి 90 రోజుల్లో బయటకు వస్తాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..